IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు

IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ జరిగింది. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు  రాష్ట్ర ప్రభుత్వం కీలక అధికారులను  బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 30, 2024, 06:36 AM IST
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు

IPS Transfers: మరో రెండు నెలల్లో అటు అసెంబ్లీ, ఇటు లోక్‌సభ ఎన్నికలుండటంతో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఏకంగా 30 మంది ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. ఏపీతో పాటు అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల సీఈవో, ఛీఫ్ సెక్రటరీలకు బదిలీలపై మార్గదర్శకాలు జారీ అయ్యాయి. 

ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నేపధ్యంలో ఎన్నికలతో ప్రత్యక్ష సంబంధమున్న ఉన్నతాధికారుల బదిలీలు, పోస్టింగులపై కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ చేసింది. అధికారులు సొంత జిల్లాలో ఉండకూడదని, దీర్ఘకాలంగా అంటే మూడేళ్లుగా ఒకే జిల్లాలో కొనసాగకూడదని ఆ మార్గదర్శకాలున్నాయి. ఈ క్రమంలో అధికారుల బదిలీలు, పోస్టింగుల ప్రక్రియను 2024 జనవరి నాటికి పూర్తి చేసి నివేదిక సమర్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 30 మంది ఐపీఎస్ అధికారుల్ని బదిలీ చేసింది. ఇవాళ లేదా రేపటికి డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, ఆర్ఐలు కూడా బదిలీ కానున్నారు. ఇక ఎక్సైజ్ శాఖలో ఎస్సై అంతకంటే పై అధికారులకు సైతం బదిలీలు ఉంటాయి. పరిపాలనాపరంగా చూసుకుంటే జిల్లా ఎన్నికల అధికారులు, ఉప ఎన్నికల అధికారులు, ఆర్ఓలు, జాయింట్ కలెక్టర్లు, ఆర్డీవోలు, సబ్ కలెక్టర్లు, తహశిల్దార్ల బదిలీలు జరగనున్నాయి. 

రాష్ట్రంలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అదనపు డీజీగా ఉన్న కుమార్ విశ్వజిత్‌ను రైల్వే అదనపు డీజీగా నియమించారు. ఇక సర్వశ్రేష్ఠ త్రిపాఠికు సీఐడీ ఐజీగా బాధ్యతలు అప్పగించారు. అతుల్ సింగ్ ఏపీఎస్పీ అదనపు డీజీగా, సీఐడీ ఐజీ సీహెచ్ శ్రీకాంత్ ఆక్టోపస్ ఐజీగా, ఇంటెలిజెన్స్ ఐజీ కొల్లి రఘురామిరెడ్డిని విజిలెన్స్ ఐజీగా నియమించారు. అక్టోపస్ ఐజీ ఎస్‌వి రాజశేఖర్ బాబుని ఎస్ఎల్‌పీఆర్‌బి ఛైర్మన్గా నియమించారు. విశాఖపట్నం డీఐజీ ఎస్ హరికృష్ణను ఐజీపీ పర్సనల్‌గా నియమించారు. డీజీపీ కార్యాలయం డీఐజీ కేవి మోహన్ రావును ఐజీ స్పోర్ట్స్ , కర్నూలు రేంజ్ డీఐజీ ఎస్ సెంథిల్ కుమార్‌ను ఆక్టోపస్ డీఐజీగా నియమించారు. 

ఇక ఏపీఎస్పీ విజయనగరం బెటాలియన్ కమాండెంట్ రాహుల్ దేవ్ శర్మను డీజీపీ ట్రైనింగ్ డీఐజీగా, విజయవాడ లా అండ్ ఆర్డర్ డీసీపీ విశాల్ గున్నిని విశాఖపట్నం డీఐజీగా, సీఐడీ ఎస్పీ కే ఫక్కీరప్పను విశాఖపట్నం జాయింట్ కమీషనర్‌గా నియమించారు. ఏసీబీ ఎస్పీ అద్నం నయీమ్ అస్మిను కృష్ణా జిల్లా ఎస్పీగా, సీఐడీ ఎస్పీ అమిత్ బర్దర్‌ను మంగళగిరి 6వ బెటాలియన్ కమాండెంట్‌గా , గుంటూరు ఎస్పీ ఆరిప్ హఫీజ్‌ను ఇంటెలిజెన్స్ ఎస్పీగా నియమించారు. 

జగ్గయ్యపేట డీసీపీ అజిత్ వెజెండ్లను పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా, మంగళగిరి 6వ బెటాలియన్ కమాండెంట్ సుబ్బారెడ్డిని రాజమండ్రి రీజనల్ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్‌గా, చిత్తూరు ఎస్పీ వై రిషాంత్ రెడ్డిని యాంటీ స్మగ్లింగ్ టాస్క్ పోర్స్ ఎస్పీగా నియమించారు. కృష్ణా జిల్లా ఎస్పీ పి జోషువాను చిత్తూరు ఎస్పీగా, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రవి ప్రకాష్‌ను ఏసీబీ ఎస్పీగా నియమించారు. 

శ్రీకాకుళం జిల్లా ఎస్ఈబి అదనపుఎస్పీ మణికంఠ చందోలును విశాఖపట్నం లా అండ్ ఆర్డర్ డీసీపీగా, నర్శీపట్నం గ్రేడ్ 1 ఏఎస్పీ అధిరాజ్ సింగ్ రాణాను విజయనగరం 5వ బెటాలియన్ కమాండెంట్‌గా నియమించారు. కర్నూలు ఎస్ఈబి అదనపు ఎస్పీ కృష్ణకాంత్ పాటిల్‌ను కాకినాడ 3వ బెటాలియన్ కమాండెంట్‌గా, అడ్మిన్ అదనపు ఎస్పీ తుషార్ దూడిని గుంటూరు ఎస్పీగా నియమించారు. విశాఖపట్నం లా అండ్ ఆర్డర్ డీసీపీ కే శ్రీనివాసరావును జగ్గయ్యపేట డీసీపీగా, పాడేరు ఏఎస్పీ దీరజ్ కుసుబిల్లిని రంపచోడవరం ఏఎస్పీగా, రంపచోడవరం ఏఎస్పీ జగదీష్ అడహల్లిని పాడేరు ఏఎస్పీగా నియమించారు. విశాఖపట్నం లా అండ్ ఆర్డర్ 2 డీసీపీ ఆనంద్ రెడ్డిని విజయవాడ లా అండ్ ఆర్డర్ డీసీపీగా, విజయవాడ డీసీపీ మొక్కా సత్యనారాయణను విశాఖపట్నం లా అండ్ ఆర్డర్ డీసీపీగా నియమించారు. 

Also read: YS Sharmila: ''సాక్షిలో నాకూ వాటా ఉంది ".. సీఎం జగన్ ను ఏకీపారేసిన వైఎస్ షర్మిల..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News