Bank Holiday on May 20th: సోమవారం బ్యాంకులకు సెలవు.. ఎందుకో తెలుసా?

Bank Holiday on May 20th:  సాధారణంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పబ్లిక్ ప్రైవేట్‌ సెక్టార్ బ్యాంకులకు ఆదివారం మరికొన్ని ప్రత్యేక రోజుల్లోనే బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఈ నేపథ్యంలో రానున్న సోమవారం అంటే మే 20వ తేదీన కూడా అన్ని బ్యాంకులకు సెలవు దినంగా ప్రకటించారు. ఆరోజు ఏ ప్రత్యేకత ఉందో తెలుసుకుందాం.

Written by - Renuka Godugu | Last Updated : May 17, 2024, 03:39 PM IST
Bank Holiday on May 20th: సోమవారం బ్యాంకులకు సెలవు.. ఎందుకో తెలుసా?

Bank Holiday on May 20th:  సాధారణంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పబ్లిక్ ప్రైవేట్‌ సెక్టార్ బ్యాంకులకు ఆదివారం మరికొన్ని ప్రత్యేక రోజుల్లోనే బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఈ నేపథ్యంలో రానున్న సోమవారం అంటే మే 20వ తేదీన కూడా అన్ని బ్యాంకులకు సెలవు దినంగా ప్రకటించారు. ఆరోజు ఏ ప్రత్యేకత ఉందో తెలుసుకుందాం. సోమవారం మే 20వ తేదీన ఐదవ దశ లోక్‌ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 695 మంది అభ్యర్థులు, 49 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఒడిశా, ఉత్తరప్రదేశ్‌, జార్ఘంఢ్‌, లద్దాక్, పశ్చిమ బెంగాల్చ మహారాష్ట్ర, బిహార్, జమ్మూ కశ్మీర్ లో ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కొన్ని నగరల్లో ఉన్న బ్యాంకులకు సెలవు ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులు సోమవారం నాడు సెలవు దినంగా ప్రకటించింది. ఇది అన్ని వాణిజ్య బ్యాంకులకు వర్తిస్తుంది. ఆర్‌బీఐ ప్రకారం సోమవారం 20 బెలపూర్, ముంబై ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు ప్రకటించింది.

మూడు విభాగాలుగా ఈ బ్యాంకుల బంద్‌ను ఆర్‌బీఐ ప్రకటించింది. నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ యాక్ట్‌, హాలిడే నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్‌ యాక్ట్‌, రియల్ టైం గ్రాస్ సెట్టిల్మెంట్‌ హాలిడే ప్రకారం జరగనుంది. అంతేకాదు మే నెలలో ఇది చివరివారం బ్యాంక్ హాలిడేలు కూడా ఎక్కువగా రానున్నాయి. మే 23 బుద్ధపూర్ణిమ రానుంది. అలాగే మే 25న నజ్రూల్ జయంతి, ఆరో దశ లోక్‌ సభ ఎన్నికలు కూడా అదే రోజున జరగనుంది. ఇక మే 25 నాలుగో శనివారం సెలవుదినం ఆదివారం మే 26 ఆరోజు కూడా బ్యాంకులకు సెలవు.

ఇదీ చదవండి:  వ్యాపారం చేయడానికి రూ. 5000 వేలు కూడా లేనివ్యక్తి.. నేడు రూ. 16,900 కోట్లకు అధిపతి..

అయితే, ఈ బ్యాంకుల సెలవు నగరలవారీగా ఒక్కరోజు చోటు చేటు చేసుకుంటుంది. మొత్తానికి మే చివరి వారంలో బ్యాంకులు ఎక్కువ శాతం సెలవుల్లో ఉండనున్నాయి. డిజిటల్ బ్యాంకింగ్‌ , ఏటీఎం సేవలు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ వివిధ అవసరాల దృష్ట్యా కస్టమర్లు బ్యాంకులకు వెళ్తుంటారు. అటువంటి వారు ఈ బ్యాంకులకు వెళ్లే ముందు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. మొత్తంగా మే నెలలో రెండో, నాలుగో శనివారం, ఆదివారాలు కాకుండా పూర్తిగా 9 రోజులపాటు సెలవులు రానున్నాయి.

ఇదీ చదవండి: టాటా ఆల్ట్రోజ్ వర్సెస్ న్యూ మారుతి స్విఫ్ట్ మధ్య తేడా, ఫీచర్లు, ధర ఎంత

ఇప్పటి వరకు 2024 లో దాదాపు 451 మిలియన్ల మంది నాలుగు దశల ఎన్నికల్లో వినియోగించుకున్నట్లు భారత ఎన్నికల కమిషన్ తెలిపింది. మొత్తం 66.95 శాతం పోలింగ్‌ నమోదైంది. ఓటు హక్కు వినియోగం గురించి అనేక అవగాహన కార్యక్రమాలు కూడా దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్‌ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఓటరు లిస్ట్‌లో మీ పేరు ఉంటే తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల కమిషన్ తెలిపింది. ఏదైనా గుర్తింపు కార్డు సహాయంతో మీ దగ్గర్లో ఉన్న పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించింది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News