FD Rates: ఎఫ్‌డీపై అత్యధికంగా 9 శాతం వడ్డీ ఇస్తున్న బ్యాంకుల జాబితా ఇదే

FD Rates: భవిష్యత్ సంరక్షణకు చాలామంది వివిధ రకాల సేవింగ్ ప్లాన్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. వీటిలో ముఖ్యమైంది ఫిక్స్డ్ డిపాజిట్ ప్లాన్స్. అయితే ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఒక్కో బ్యాంకులో ఒక్కోరకంగా ఉంటాయి. అందుకే ఎఫ్‌డి చేసే ముందు ఏ బ్యాంకులో ఎంత వడ్డీ ఉందనేది తెలుసుకోవాలి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 1, 2024, 08:15 PM IST
FD Rates: ఎఫ్‌డీపై అత్యధికంగా 9 శాతం వడ్డీ ఇస్తున్న బ్యాంకుల జాబితా ఇదే

FD Rates: దేశంలో చాలా రకాల బ్యాంకింగ్ వ్యవస్థలున్నాయి. పెద్ద పెద్ద జాతీయ బ్యాంకులు, ప్రైవేట్ ఇంటర్నేషనల్ బ్యాంకులు, చిన్న తరహా బ్యాంకులు. అన్ని బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుర్తింపు కలిగినవే. సాధారణంగా పెద్ద బ్యాంకులతో పోలిస్తే చిన్న తరహా బ్యాంకుల్లోనే వడ్డీ ఎక్కువగా లభిస్తుంటుంది. ముఖ్యంగా ఎఫ్‌డీలపై చిన్న బ్యాంకులు అధిక వడ్డీ ఆఫర్ చేస్తుంటాయి. 

దేశంలో చిన్న తరహా ప్రాంతీయ ప్రైవేట్ బ్యాంకులు చాలా ఉన్నాయి. ఇందులో దాదాపు చాలా బ్యాంకులు ఎఫ్‌డీలపై అత్యధికంగా 9 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. అయితే ఇతర బ్యాంకులతో పోలిస్తే ఇందులో ఇన్వెస్ట్‌మెంట్ అనేది కాస్త రిస్క్‌తో కూడుకున్నదే. రిస్క్ ఫరవాలేదనుకుంటే 9 శాతం వడ్డీ అందుకోవచ్చు. దాదాపు 2 కోట్ల వరకూ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి ఈ బ్యాంకులు. 

యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 1001 రోజుల కాల పరిమితి కలిగిన ఎఫ్‌డీపై 9 శాతం వడ్డీ ఇస్తోంది. 
సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అయితే 2 సంవత్సరాల 2 రోజుల కాల వ్యవధి కలిగిన ఎఫ్‌డీపై 8.65 శాతం వడ్డీ చెల్లిస్తోంది.
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 15 నెలల ఎఫ్‌డీపై అత్యధికంగా 8.5 శాతం వడ్డీ ఇస్తోంది.
జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 365 రోజుల ఎఫ్‌డీపై 8.5 శాతం వడ్డీ అందిస్తోంది.
ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 444 రోజుల ఎఫ్‌డిపై 8.5 శాతం వడ్డీ ఇస్తోంది.
ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 2-3 ఏళ్ల కాలపరిమితి కలిగిన ఎఫ్‌డీలపై 8.5 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది.
ఈఎస్ఏఎఫ్ స్మాల్ పైనాన్స్ బ్యాంక్ 2-3 ఏళ్ల కాల పరిమితి కలిగిన ఎఫ్‌డీలపై 8.25 శాతం వడ్డీ ఇస్తోంది. 
ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 18 నెలల ఎఫ్‌డీపై 8 శాతం వడ్డీ ఇస్తోంది. 

Also read: Healthy Hair Tips: చుండ్రు సమస్యతో విసిగిపోతున్నారా, మందు మీ ఇంట్లోనే ఉంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News