Mahindra XUV 3XO: కేవలం 7.49 లక్షలకే Mahindra XUV 3XO లాంచ్, మే 15 నుంచి బుకింగ్స్

Mahindra XUV 3XO Launch: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎస్‌యూవీ వచ్చేసింది. ప్రముఖ కార్ల తయారీ సంస్థ మహీంద్రా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న Mahindra XUV 3XO లాంచ్ అయింది. ఈ కారు ఫీచర్లు, ధర, ఇతర వివరాలు పరిశీలిద్దాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 1, 2024, 12:23 PM IST
Mahindra XUV 3XO: కేవలం 7.49 లక్షలకే Mahindra XUV 3XO లాంచ్, మే 15 నుంచి బుకింగ్స్

Mahindra XUV 3XO Launch: మహీంద్రా సంస్థకు చెందిన Mahindra XUV 3XO ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌పై చాలాకాలంగా నిరీక్షణ ఉంది. మొట్టమొదటి సారిగా కాంపాక్ట్ ఎస్‌యువి విభాగంలో లాంచ్ అయిన కారు ఇది. అద్భుతమైన ఫీచర్లతో ప్రముఖ కార్లతో పోటీ పడనుంది. మొత్తం 5 వేరియంట్లలో లభించనున్న ఈ కారుపై మహీంద్రా సంస్థకు చాలా అంచనాలున్నాయి. 

Mahindra XUV 3XOలో గత మోడల్స్‌తో పోలిస్తే చాలా మార్పులు ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్‌లో కన్పిస్తున్నాయి. ఎల్ఈడీ డీఆర్ఎల్స్ సీ ఆకారంలో ఉండటం, హెడ్ ల్యాంప్ కస్టర్ లుక్ విభిన్నంగా ఉండటంతో కారు విపరీతంగా ఆకట్టుకోనుంది. ఇందులో మూడు రకాల ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో 109 బీహెచ్‌పి పవర్, 200 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ కాగా రెండవది 1.2 లీటర్ టర్బో పెట్రోల్ 129 బీహెచ్‌పి పవర్, 230 ఎన్ఎం టార్క్ సామర్ధ్యం కలిగిన ఇంజన్‌తో ఉంటుంది. ఇక మూడవది 1.5 లీటర్ టర్బో ఇంజన్ కలిగి 6 స్పీడ్ మేన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్, 6 స్పీడ్ ఏఎంటీ ట్రాన్స్‌మిషన్ కలిగి ఉంటుంది. 

మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ వోలో డ్యాష్‌బోర్డు పూర్తి రీడిజైన్ చేశారు. 3 స్పోక్ స్టీరింగ్ వీట్  అండ్ వెంటిలేటెడ్ సీట్లు, డ్యూయల్ జోన్ ఆటోక్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, 360 డిగ్రీల కెమేరా ఫీచర్లు ఉన్నాయి. ఇది కాకుండా అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్. లేన్ కీప్ అసిస్ట్ , హిల్ డిసెంట్ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, వెహికల్ డైనమిక్స్ కంట్రోల్ వంటి 35 రకాల సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

Mahindra XUV 3XOలో బేసిక్ మోడల్ MX1 ధర 7.49 లక్షలతో ప్రారంభమౌతుంది. ప్రీమియం మోడల్ AX7 L ధర 13.99 లక్షల్నించి 15.49 లక్షల వరకూ ఉంటుంది. మరో వేరియంట్ MX2 Pro ధర 8.99 లక్షల్నించి 9.99 లక్షల వరకూ ఉంటుంది. ఇక  MX3 అయితే 10.89 లక్షలుంటుంది. మొత్తం 5 రకాల వేరియంట్లలో లభ్యం కానున్న Mahindra XUV 3XO మార్కెట్‌లో ఉన్న టాటా నెక్సాన్, కియా సోనెట్, హ్యుండయ్ వెన్యూ, నిస్సాన్ మాగ్నైట్, రెనో కైగర్‌లకు పోటీగా ఉండనుంది.

Also read: Jio Cinema: రోజుకు 1 రూపాయితో జియో సినిమా ప్రీమియం సభ్యత్వం, 12 ఓటీటీలతో జియో ప్లాన్స్

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News