New Tax Regime 2023: కొత్త పన్ను విధానం ఉపయోగాలు ఇవే.. ఆ బెనిఫిట్స్‌ మాత్రం లేవు

New Tax Regime Benefits: ట్యాక్స్ పేయర్లకు ఎక్కువ బెనిఫిట్స్ ఉండే విధంగా కొత్త పన్ను విధానాన్ని కేంద్ర ప్రభుత్వం 2020లో ప్రవేశపెట్టింది. కొత్త పన్ను విధానంలో రూ.50 వేల వరకు స్టాండర్డ్ డిడక్షన్ పొందొచ్చు. పాత పన్ను విధానంతో పోలిస్తే.. కొన్ని బెనిఫిట్స్‌ కూడా ఈ విధానంలో లేవు. పూర్తి వివరాలు ఇలా..   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 17, 2023, 04:49 PM IST
New Tax Regime 2023: కొత్త పన్ను విధానం ఉపయోగాలు ఇవే.. ఆ బెనిఫిట్స్‌ మాత్రం లేవు

New Tax Regime Benefits: ప్రస్తుతం మన దేశంలో రెండు పన్ను విధానాలు ఉన్నాయి. కొంతమంది పాత పన్ను విధానంలో ట్యాక్స్ చెల్లిస్తుంటే.. మరికొందరు కొత్త పన్ను విధానంలో ట్యాక్స్ పే చేస్తున్నారు. పన్ను చెల్లింపుదారులకు ఏదైనా ఒక పన్ను విధానం ఎంచుకోవాల్సి ఉంటుంది. త పన్ను విధానంలో ట్యాక్స్ రేట్లు తక్కువగా ఉన్నాయి. కానీ మినహాయింపులు, తగ్గింపులు తక్కువగా ఉన్నాయి. కొత్త పన్ను విధానంలో ట్యాక్స్ బెనిఫిట్స్‌, మినహాయింపులు పూర్తిగా తెలుసుకోండి. 

==> ప్రామాణిక తగ్గింపు
పన్ను చెల్లించే ఉద్యోగస్తులకు రూ.50 వేల స్టాండర్డ్ డిడక్షన్ పర్మిషన్ ఉంటుంది.

==> లీవ్ ట్రావెల్ కన్సెషన్ (ఎల్‌‌టీసీ)
పన్ను చెల్లింపుదారు, వారి కుటుంబం నాలుగేళ్ల బ్లాక్‌లో రెండుసార్లు చేసే ప్రయాణ ఖర్చులకు పాత పన్నువిధానంలో ఎల్‌టీసీ మినహాయింపులు అందుబాటులో ఉంటుంది. అయితే కొత్త పన్ను విధానంలో ఈ మినహాయింపు అందుబాటులో ఉండదు.
==> ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్ఏ)
పాత పన్ను విధానంలో ఉద్యోగులు వారి జీతంలో భాగంగా ట్యాక్స్‌ బెనిఫిట్స్‌ కింద హెచ్‌ఆర్‌ఏ మినహాయింపు అందుబాటులో ఉంటుంది. అయితే కొత్త పన్ను విధానంలో ఈ మినహాయింపు అందుబాటులో లేదు.

==> సెక్షన్ 80సీ కింద మినహాయింపు
కొత్త పన్ను విధానంలో సెక్షన్ 80సీ కింద మినహాయింపు గరిష్ట పరిమితి రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంచారు. ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్‌), నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్), ఈక్విటీ-లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) వంటి పథకాలలో ఇన్వెస్ట్ చేస్తే మినహాయింపు లభిస్తుంది. 

==> సెక్షన్ 80డీ కింద మినహాయింపు
కొత్త పన్ను విధానంలో హెల్త్ ఇన్సురెన్స్ ప్రీమియం కోసం సెక్షన్ 80డీ కింద మినహాయింపు కోసం గరిష్ట పరిమితి రూ.25 వేల నుంచి రూ.50 వేలకు పెంచారు. తల్లిదండ్రులకు చెల్లించే ఆరోగ్య బీమా ప్రీమియం కోసం రూ.50 వేలు అందుబాటులో ఉంది.

Also Read: UPI Payments: ఇంటర్‌నెట్‌ లేకున్నా యూపీఐ పేమెంట్స్ చేయండి.. ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి చాలు..  

==> సెక్షన్ 80 సీసీడీ(2) కింద మినహాయింపు
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్)కి బేసిక్ శాలరీలో 10 శాతం వరకు అదనపు మినహాయింపునకు అనుమతి ఉంటుంది. స్వయం ఉపాధి పొందిన వ్యక్తులతో సహా పన్ను చెల్లింపుదారులందరికీ ఈ బెనిఫిట్ అందుబాటులో ఉంటుంది.

==> హోమ్‌లోన్‌పై చెల్లించే వడ్డీకి మినహాయింపు
కొత్త పన్ను విధానంలో ట్యాక్స్ పేయర్లు ఇంటి కొనుగోలు లేదా నిర్మాణం కోసం తీసుకున్న హోమ్ లోన్‌పై చెల్లించే వడ్డీపై రూ.1.5 లక్షల వరకు తగ్గింపును క్లెయిమ్ చేయవచ్చు. సరసమైన ఇళ్ల కోసం హోమ్‌ లోన్‌పై చెల్లించే వడ్డీకి అదనంగా రూ.1.5 లక్షల మినహాయింపును అందించే సెక్షన్ 80ఈఈఏ కింద పన్ను చెల్లింపుదారు మినహాయింపును క్లెయిమ్ చేయనట్లయితే మాత్రమే ఈ మినహాయింపు అందుబాటులో ఉంటుంది.

Also Read: Karnataka Assembly Elections 2023: బీజేపీకి భారీ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన మాజీ ముఖ్యమంత్రి  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News