Allu Arjun: పవన్ కళ్యాణ్ కి మద్దతు.. వైసిపి పార్టీకి సపోర్ట్.. అల్లు అర్జున్ వింత తీరు

Allu Arjun Supports YSRCP MLA: అల్లు అర్జున్ నంద్యాలలోని వైసిపి ఎమ్మెల్యేకి మద్దతుగా నిలవడం ప్రస్తుతం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. అంతేకాకుండా ఏకంగా నంద్యాలకి వెళ్లి అల్లు అర్జున్ వైసిపి ఎమ్మెల్యే తరుపున ప్రచారం కూడా చేశారు.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 11, 2024, 02:40 PM IST
Allu Arjun: పవన్ కళ్యాణ్ కి మద్దతు.. వైసిపి పార్టీకి సపోర్ట్.. అల్లు అర్జున్ వింత తీరు

Allu Arjun Supports YSRCP: 

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడిపోయింది. దీంతో ఎన్నికల హడావిడి శనివారం సాయంత్రంతో ముగియనున్నాయి. ఈరోజు సాయంత్రం నుంచి 144 సెక్షన్ అమలులోకి వస్తూ ఉండడంతో ఇక అందరూ ప్రచారం ముగించాల్సి ఉంది. మే 13వ తేదీ సోమవారం నాడు పోలింగ్ జరగనుంది. ఇక ప్రచారానికి ఉన్న ఈ చివరి రోజున వారి వారి చివరి బ్రహ్మాస్త్రాలను ప్రయోగిస్తున్నారు అన్ని పార్టీలు. ముఖ్యంగా నంద్యాల వైసీపీ అభ్యర్థి తన విజయం కోసం ఏకంగా మెగా కాంపౌండ్ హీరో అల్లు అర్జున్‌ని రంగంలోకి దించాడు. 

రెండు రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ కోసం తన ట్విట్టర్ లో పోస్ట్ వేసిన అల్లు అర్జున్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి అపోజిషన్ లో ఉండే జగన్ పార్టీ ఎమ్మెల్యే ప్రచారం కోసం రావడం అందరిని ఆశ్చర్యపరిచింది. మరో వైపు బాబాయ్ కోసం రామ్ చరణ్ పిఠాపురంకు వచ్చి ప్రచారం చేస్తుండగా.. అల్లు అర్జున్ మాత్రం వైసిపి పార్టీ ఎమ్మెల్యే కోసం ప్రచారం మొదలుపెట్టారు.

అసలు విషయానికి వస్తే నంద్యాల ఎన్నికల ప్రచారంలో సడెన్‌గా ఎంట్రీ ఇచ్చారు స్టైలిస్ స్టార్. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోసం స్వయంగా రంగంలోకి ఇది మరి ప్రచారం మొదలుపెట్టారు. తనకు మంచి స్నేహితుడైన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. అక్కడి ఓటర్లు తప్పకుండా రవిచంద్రారెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. అల్లు అర్జున్ తన సతీమణి స్నేహారెడ్డితో కలిసి రవిచంద్రారెడ్డి ఇంటికి కూడా వెళ్లారు.  నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి.. అల్లుఅర్జున్ దంపతులకు చాలా మంచి స్నేహితుడు.  అందువల్లనే గతంలో జరిగిన 2019 ఎన్నికల్లో కూడా రవిచంద్రారెడ్డికి బెస్ట్ విషెస్ తెలిపారు ఐకాన్ స్టార్. ఇక ఇప్పుడు కూడా తన మామ పవన్ కళ్యాణ్ కి అపోజిషన్ లో ఉండే పార్టీలో.. తన స్నేహితుడు ఉన్న.. అల్లు అర్జున్ అక్కడికి వెళ్లి తన స్నేహితుడికి సపోర్ట్ ఇవ్వడం అందరిని ఆశ్చర్యపరిచింది. బన్నీ రాక నేపథ్యంలో అక్కడకి పెద్ద ఎత్తున తరలివచ్చారు ఫ్యాన్స్.

మరోవైపు రెండు రోజుల క్రితమే పవన్‌కల్యాణ్‌ ఎన్నికల ప్రయాణం విజయవంతంగా సాగాలని కోరుకుంటూ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అని సోషల్ మీడియాలో బన్నీ పోస్ట్ వేశారు.  పవన్ ఎంచుకున్న మార్గం, సేవ చేయాలన్న నిబద్ధత పట్ల నేను ఎంతో గర్విస్తున్నా అని కూడా ఆ పోస్టులో పేర్కొన్నారు.  “ఒక ఫ్యామిలీ మెంబర్‌గా నా ప్రేమ, మద్దతు ఎప్పటికీ మీకే ఉంటాయి. మీ ఆశయాలు, లక్ష్యాలు నెరవేరాలని కోరుకుంటున్నా’’ అని రాసుకొచ్చారు అల్లు అర్జున్.

Also Read: IPL SRH vs LSG: ఉప్పల్‌లో హైదరాబాద్‌ అదుర్స్‌.. 10 ఓవర్లలోనే 10 వికెట్ల తేడాతో తిరుగులేని విజయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News