Anchor Anasuya : ఏం రాయాలో.. ఎలా రాయాలో నీతులు చెప్పిన అనసూయ.. మీడియాపై యాంకర్ సెటైర్లు

Anasuya Bharadwaj Satires on Media అనసూయ తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది. తన ఫేస్ బుక్ స్టోరీలో ఓ వీడియోను షేర్ చేసింది. అందులో అనసూయ తన మీద తప్పుగా రాసిన వారి మీద కౌంటర్లు వేసింది. ఉప్పూ కారం తింటే అలా రాయరంటూ మండి పడింది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 11, 2023, 03:19 PM IST
  • నెట్టింట్లో అనసూయ హంగామా
  • ట్విట్టర్‌లో ది కాంట్రవర్సీ రచ్చ
  • మీడియాకు నీతులు చెప్పిన అనసూయ
Anchor Anasuya : ఏం రాయాలో.. ఎలా రాయాలో నీతులు చెప్పిన అనసూయ.. మీడియాపై యాంకర్ సెటైర్లు

Anasuya Bharadwaj The Controversy అనసూయ గత రెండు మూడు రోజులుగా వార్తల్లో విపరీతంగా ట్రెండ్ అవుతూనే ఉంది. నిన్న ఓ వీడియోను తన స్టోరీలో పెట్టేసింది. అందులో తన మీద రకరకాలుగా వార్తలు రాసిన మీడియాకు నీతులు చెప్పింది. అనసూయను హీరోల ఫ్యాన్స్ ఏసుకుంటున్నారు.. ఆడేసుకుంటున్నారు అని రాశారంటూ మండి పడిపోయింది. ధైర్యంగా నిలబడి నిజం చెప్పిన అనసూయ.. హద్దులు దాటిన అభిమానులు అని రాయాలి అంటూ మీడియాకు సూచించింది. ఉప్పు కారం తింటే అలా రాయాలంటూ నీతులు వల్లించింది. పడ్డోడు ఎప్పుడూ చెడ్డోడు కాదంటూ సూక్తులు కూడా చెప్పింది.

అనసూయ సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీతో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. అనసూయకు, విజయ్‌ దేవరకొండకు లోలోపల ఏం జరిగిందో తెలీదు గానీ.. ముందు నుంచీ ఇద్దరి మధ్య అంత మంచి సంబంధాలున్నట్టుగా కనిపించడం లేదు. టీవీ డిబెట్‌లో అర్జున్ రెడ్డి గురించి అనసూయ మాట్లాడిన మాటలతోనే ఈ వివాదాలకు బీజం పడినట్టుగా అనిపిస్తోంది. అయితే విజయ్ దేవరకొండ బ్యానర్‌లో అనసూయ కూడా నటించింది. అయినా వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ మాత్రం నడుస్తూనే వస్తోంది. 

ఖుషి సినిమా పోస్టర్ మీద ది విజయ్ దేవరకొండ అని ఉండటం, దాని మీద అనసూయ సెటైర్ వేయడం.. దీంతో రౌడీ ఫ్యాన్స్ అంతా కూడా అనసూయను టార్గెట్ చేయడం తెలిసిందే. హరీష్‌ శంకర్ లాంటి దర్శకుడు కూడా అనసూయకు కాలేలా.. ది ట్యాగ్‌ను విజయ్‌కు అంటించాడు. అలా రెండ్రోజుల నుంచి ఈ హీట్ కొనసాగుతూనే ఉంది. పైగా ఆంటీ అంటూ మళ్లీ అనసూయను ట్రోల్ చేయడం ప్రారంభించారు. కొంత మంది అనసూయకు మద్దతుగా ఉంటే.. ఇంకొంత మంది అనసూయను తిట్టిపోస్తున్నారు.

Also Read:  Adipurush Trailer: ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్.. మా రాఘవుడి కథే రామాయణం.. ఆ ఒక్కటే మైనస్

ఇలాంటి ట్రోల్స్, కాంట్రవర్సీలకు అనసూయ భయపడేది కాదని అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో తన మీద తిట్టే వాళ్లను సైబరాబాద్ పోలీసుల దృష్టిలోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తనను తిట్టిన ఏ ఒక్కరినీ వదిలి పెట్టనని అప్పట్లో నెటిజన్లకు వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అనసూయ పలు సినిమాలతో బిజీగా ఉంది. బుల్లితెరకు అయితే పూర్తిగా దూరంగా ఉంటోంది.

Also Read:  HBD Sai Pallavi : నీ చెల్లిగా పుట్టినందుకు నేను లక్కీ.. మిస్ అవుతున్నా.. సాయి పల్లవి సిస్టర్ స్పెషల్‌ విషెస్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News