Bengaluru Rave Party: బెంగళూరులో భారీ రేవ్ పార్టీ.. పోలీసులో అదుపులో సినీ ప్రముఖులు వీళ్లే..

Bengaluru Rave Party: బెంగళూరులో అనధికారికంగా జరిగిన భారీ రేవ్ పార్టీలో పలువురు సినీ ప్రముఖులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు ఎస్వోటి పోలీసులు అదుపులో టాలీవుడ్ సినీ రంగానికి చెందిన పలువురు సెలబ్రిటీలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

Written by - TA Kiran Kumar | Last Updated : May 20, 2024, 11:24 AM IST
Bengaluru Rave Party: బెంగళూరులో భారీ రేవ్ పార్టీ.. పోలీసులో అదుపులో సినీ ప్రముఖులు వీళ్లే..

Bengaluru Rave Party: ఆదివారం సాయంత్రం ఐదు గంటల నుంచి సోమవారం ఉదయం ఆరు గంటలకు జరిగిన ఈ రేవ్ పార్టీకి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు విమానాల్లో హాజరైనట్టు సమాచారం. రేవ్ పార్టీ జరుగుతున్న సమాచారం అందుకున్న పోలీసులు రెయిడ్ చేసి పార్టీలో పాల్గొన్న వారినీ అదుపులోకి తీసుకున్నారు. రేవ్ పార్టీ జరిగిన ప్రదేశాన్ని నార్కోటిక్ స్నిఫర్ డాగ్స్ తనిఖీ చేస్తున్నాయి. బెంగళూరు సమీపంలోని ఎలక్ట్రానిక్ సిటీలో 100 మందికి పైగా పట్టుపడ్డట్టు సమాచారం. ఈ పార్టీకి పలువురు లీడర్లు.. టాలీవుడ్‌కు చెందిన సెలబ్రిటీలు హాజరైనట్టు బెంగళూరు మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలో జరగుతోన్న రేవ్ పార్టీపై ముందస్తు సమాచారం అందుకున్న బెంగళూరు స్పెషల్ పోలీసులు GR ఫామ్‌ హౌస్ పై ఉదయం 3 గంటల సమయంలో మెరుపు దాడి చేసారు. పోలీసులు జరిపిన సోదాల్లో నిషేధిత డ్రగ్స్ పట్టుబడటం సంచలనంగా మారింది. అంతేకాదు 12 డజను పైగా ఎండీఎంఏ ట్యాబెట్లు, కొకైన్ కూడా పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. ఈ పార్టీలో 25 మందికి పైగా యువతులు ఉన్నట్లు చెబుతున్నారు.

జీఆర్ ఫామ్‌హౌస్.. అంటే గోపాల్ రెడ్డి ఫామ్‌హౌస్..  కాన్ కార్డ్ ఓనర్ గోపాల్ రెడ్డి.. ఆయన ఫామ్‌హౌస్‌లో ఈ రేంజ్‌లో ఎందుకు పార్టీ నిర్వహించనట్టు సమాచారం తెలియాల్సి ఉంది. ఈ పార్టీని  తెలంగాణకు చెందిన వాసు అనే వ్యక్తి కనుసన్నల్లో జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. వాసు మూర్తి తన పుట్టినరోజును ఎందుకు గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. దీనిపై బెంగళూరు పోలీసులు ఆరా తీస్తున్నారు.  

ఈ రేవ్ పార్టీకి హై  ఎండ్ పోష్ కార్లు చాలా వచ్చాయి. అందులో ఓ బెంజ్ కారుపై ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి పేరుతో స్టిక్కర్ ఉంది. దీనిపై ఎమ్మెల్యే క్లారిటీ ఇచ్చారు. తన పేరుతో ఎవరో కారును వాడుకుంటున్నారు. దాంతో తనకు సంబంధం లేదన్నారు.
ఈ రేవ్ పార్టీకి వచ్చిన వారిలో చాలా మందే సెలబ్రిటీలు అటెండ్ అయినట్టు సమాచారం. ముఖ్యంగా బెంగళూరు మీడియాలో సర్కులేట్ అవుతోంది. ఈ విషయమై హేమను కాంటాక్ట్ చేస్తే తాను హైదరాబాద్‌లో ఉన్నానని స్పష్టం చేసింది. రేవ్ పార్టీలో తాను ఉన్నట్టు వస్తోన్న వార్తలను ఆమె ఖండించారు.

Also read: Iran Helicopter Crash: హెలీకాప్టర్ ఎక్కడ కూలింది, ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రాణాలతో ఉన్నారా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News