ఆ మహానటితో అలా కలిసి నటించే అదృష్టం నాకు మాత్రమే దక్కింది : చిరంజీవి

మహానటి సావిత్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న మెగాస్టార్ చిరంజీవి 

Last Updated : May 10, 2018, 01:04 PM IST
ఆ మహానటితో అలా కలిసి నటించే అదృష్టం నాకు మాత్రమే దక్కింది : చిరంజీవి

చాలామందికి తెలియని ఓ ఆసక్తికరమైన విషయాన్ని ఆభిమానులతో షేర్ చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. మహానటి రిలీజ్ సందర్భంగా ఆ సినిమా గురించి మాట్లాడిన చిరు, మహానటి సావిత్రితో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. తనను వెండితెరకు పరిచయం చేసిన సినిమా పునాది రాళ్లు అయితే, అందులో సావిత్రమ్మతో కలిసి నటించే అవకాశం తనకు దక్కింది అని అన్నారు చిరు. "నాకు మాత్రమే దక్కిన అదృష్టం ఏంటంటే.. నా కెరీర్‌కు పునాది వేసిన పునాది రాళ్లు చిత్రంలోనే సావిత్రి గారితో కలిసి నటించాను. అలా మొట్టమొదటి చిత్రంతోనే ఆమెతో కలిసి నటించే అదృష్టం దక్కింది. గ్లిజరిన్ సహాయం లేకుండానే కన్నీళ్లు కార్చగలిగే ఉత్తమ నటి, కళ్ల కదలికతోనే హావభావాలు పలికించి, తాను కదలకుండా కథంతా నడిపించే మహానటి కేవలం సావిత్రి గారు మాత్రమే" అని ఆ మహానటితో తనకు ఉన్న అనుబంధాన్ని మెగాస్టార్ తన అభిమానులతో పంచుకున్నారు.
  
ఓ నటిగా, వ్యక్తిగా, అమ్మగా, స్ఫూర్తి ప్రదాతగా నిలిచిపోయిన సావిత్రమ్మ, ఈ చిరంజీవి మనసులో ఎప్పటికీ చిరంజీవేగానే ఉంటారన్న చిరంజీవి.. అలాంటి మహానటి యదార్ధగాధ ఆధారంగా బయోపిక్ తీసి, నేటి తరానికి ఆమె గొప్పదనాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్న యూనిట్ మొత్తానికి అభినందలు తెలిపారు.

Trending News