HBD Vijay Deverakonda : అనసూయకు మండిపోయేలా హరీష్‌ శంకర్ ట్వీట్.. యాంకర్ కౌంటర్లు.. నెటిజన్ల సెటైర్లు

Vijay Devarakonda Birthday విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా నెట్టింట్లో సందడి కనిపిస్తోంది. విజయ్ ఫ్యాన్స్ ఇప్పుడు ట్విట్టర్‌లో హంగామా చేస్తున్నారు. హరీష్‌ శంకర్ తాజాగా వేసిన ట్వీట్ చూస్తుంటే.. అనసూయకు మండిపోయేలా చేసినట్టుగా కనిపిస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 9, 2023, 09:12 AM IST
  • నెట్టింట్లో విజయ్ ఫ్యాన్స్ సందడి
  • ది అంటూ హరీష్‌ శంకర్ విషెస్
  • అనసూయకు మండేలా ట్వీట్లు
HBD Vijay Deverakonda : అనసూయకు మండిపోయేలా హరీష్‌ శంకర్ ట్వీట్.. యాంకర్ కౌంటర్లు.. నెటిజన్ల సెటైర్లు

Vijay Devarakonda Birthday రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో హంగామా కనిపిస్తోంది. రౌడీ ఫ్యాన్స్ అంతా కూడా సందడి చేస్తున్నారు. ఇక నేడు ఈయన బర్త్ డే సందర్భంగా ఖుషి సినిమాలోని మొదటి సాంగ్‌ను రిలీజ్ చేయబోతోన్నారు. అయితే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు అనసూయకు ఈ మధ్య జరిగిన వివాదం గురించి తెలిసిందే. మామూలుగానే అనసూయ, విజయ్‌ల మధ్య కోల్డ్ వార్ నడుస్తుంటుంది. విజయ్ ఫ్యాన్స్‌ ఎప్పుడూ ఆమె మీద ఓ కన్నేసి ఉంచుతారు.

ది విజయ్ దేవరకొండ అని ఖుషి పోస్టర్‌లో ఉంది. దీంతో అనసూయ విజయ్‌ని పరోక్షంగా టార్గెట్ చేసింది. ఈ ది పైత్యం ఏంటో అంటూ కౌంటర్లు వేసింది. దీంతో అనసూయను విజయ్ ఫ్యాన్స్ ఆడేసుకున్నారు. విజయ్ అభిమానులు ఎంతగా రెచ్చిపోతుంటే.. అంతగా అనసూయ సైతం కౌంటర్లు వేస్తూ వచ్చింది. హీరోలు తమ అభిమానులను అదుపులో పెట్టుకోలేరా? అంటూ కౌంటర్లు వేసింది. నువ్ కూడా ఇలాంటి పిచ్చి ట్వీట్లు వేయడం, గెలకడం ఆపలేవా? అని విజయ్ ఫ్యాన్స్ సెటైర్లు వేశారు.

 

అయితే తాజాగా విజయ్ బర్త్ డే సందర్భంగా హరీష్‌ శంకర్ ది అంటూ విషెస్ చెప్పాడు.. ది కామ్, ది హీరో, ది యాంగర్ కంట్రోల్ ఇలా ది అంటూ విషెస్ చెప్పాడు. అనసూయకు కౌంటర్లు వేయాలనే ఉద్దేశంలో విజయ్‌కి విషెస్ చెప్పాడో ఏమో గానీ.. విజయ్ ట్విట్టర్‌ హ్యాండిల్‌ని తప్పుగా ట్యాగ్ చేశాడు. దీంతో కావాలనే చేశావా? తెలిసే చేశావా? అంటూ విజయ్ ఫ్యాన్స్ కౌంటర్లు వేస్తున్నారు. ఇక అనసూయకు మండిపోయేలా ట్వీట్ వేశావ్ కదా? అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Also Read:  Samantha : రాత్రంతా అదే పని.. ఉదయమంతా ఇలా.. సమంత పోస్ట్ వైరల్

అయితే అనసూయ కూడా హరీష్‌ శంకర్‌కు కౌంటర్ వేసినట్టుగానే కనిపిస్తోంది. వంద మంది కలిసి చేసినా తప్పు తప్పే.. ఒక్కడు రైట్ చేసినా రైట్ అవుతుంది అంటూ ఉన్న ఓ కొటేషన్‌ను షేర్ చేసింది. అలా అందరూ కలిసి తనను టార్గెట్ చేసినా వాళ్లది తప్పే అన్నట్టుగా.. ఒంటరిగా నిలబడి తాను చేస్తోంది రైట్ అన్నట్టుగా చెప్పినట్టు అనిపిస్తోంది.

Also Read:  Rakul Preet Pics : రకుల్ ప్రీత్ అందాల ప్రదర్శన.. నాభి అందాల విందు.. పిక్స్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News