Suriya Launches Hit Movie Teaser: వెర్సటైల్ హీరో సూర్య చేతుల మీదగా 'హిట్ లిస్ట్' మూవీ టీజర్ లాంచ్..

Suriya Launches Hit Movie Teaser: తమిళ దర్శకుడు విక్రమన్ కుమారుడు విజయ్ కనిష్క్ హీరోగా నటించిన లేటస్ట్ మూవీ 'హిట్'. శరత్ కుమార్, గౌతమ్ వాసుదేవ మీనన్, సముద్రఖిన ముఖ్యపాత్రల్లో నటించిన మూవీ 'హిట్'. తాజాగా ఈ సినిమా తెలుగు టీజర్‌ను సూర్య ఆవిష్కరించారు.

Written by - TA Kiran Kumar | Last Updated : May 17, 2024, 06:55 PM IST
Suriya Launches Hit Movie Teaser: వెర్సటైల్ హీరో సూర్య చేతుల మీదగా 'హిట్ లిస్ట్' మూవీ టీజర్ లాంచ్..

Suriya Launches Hit Movie Teaser: తమిళ డైరెక్టర్ విక్రమన్ తనయుడు విజయ్ కనిష్క్ హీరోగా నటించిన మూవీ 'హిట్'. సూర్యకతిర్ కాకల్లార్ కే.కార్తికేయన్ దర్శకత్వంలో ఆర్.కే.సెల్యూలాయిడ్స్ పై దర్శకుడు కే.యస్.రవికుమార్ నిర్మించిన సినిమా. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లు మంచి రెస్పాన్స్ వచ్చాయి. ఈ రోజు ఈ సినిమా టీజర్‌ను వెర్సటైల్ యాక్టర్ సూర్య ఆవిష్కరించారు. యాక్షన్ కమ్ సస్పెన్స్, క్రైమ్ జోనర్ లో వస్తున్న ఈ సినిమా టీజర్ ఆకట్టుకునే విధంగా ఉంది.  ప్రస్తుతం ఆడియన్స్ ని ఎక్కువగా క్రైమ్, సస్పెన్స్ జానర్ సినిమాలు ఆకట్టుకుంటున్నాయి. ఇది కూడా ఆ జానర్ లోకి తెరకెక్కింది. టీజర్ సినిమా పైన అంచనాలను పెంచేసింది.

టీజర్ చూసిన తర్వాత హీరో సూర్య మాట్లాడుతూ : టీజర్ చాలా బాగుందంటూ మెచ్చుకున్నారు. అంతేకాదు సినిమా ఇంకా బాగుంటుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఖచ్చితంగా ఈ సినిమా విజయ్ కనిష్క కి ఈ టీం కి మంచి సక్సెస్ ఇవ్వాలని మనస్పూర్తిగా కోరారు.

నటుడు సూర్య విషయానికొస్తే.. ప్రస్తుతం ఈయన సోషియో ఫాంటసీ నేపథ్యంలో కంగువా సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలో సూర్య సరసన దిశా పటానీ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో సూర్య పూర్తి స్థాయి విభిన్న పాత్రలో కనిపించబోతున్నాడు. అంతేకాదు సూర్య కెరీర్‌లో ఈ సినిమా డిఫరెంట్ మూవీగా నిలిచిపోవడం ఖాయం అంటున్నారు.   

నటీనటులు :
విజయ్ కనిష్క, శరత్ కుమార్, సముద్రఖని, గౌతమ్ వాసుదేవ మీనన్, మునిష్కాంత్ కింగ్స్ లే, సితార, స్మృతి వెంకట్, రామచంద్ర రాజు (కే జి ఎఫ్ గరుడ), రామచంద్రన్, ఐశ్వర్య దత్త, అభి నక్షత్రం.

టెక్నీషియన్స్ :
నిర్మాణం : ఆర్. కె. సెల్లులాయిడ్స్
నిర్మాత : కె. ఎస్  రవికుమార్
ఎడిటర్ : జాన్ అబ్రహం
మ్యూజిక్ : సి. సత్య
డి ఓ పి : కే. రామ్ చరణ్
కథ : ఎస్. దేవరాజ్
దర్శకత్వం : సూర్య కతిర్ కాకల్లార్, కే. కార్తికేయన్
తెలుగు రాష్ట్రాల రిలీజ్ : శ్రీ శ్రీనివాస స్క్రీన్స్, శ్రీ శ్రీనివాస ఇన్ఫ్రా, బెక్కం ప్రొడక్షన్స్

ఇదీ చదవండి:  వ్యాపారం చేయడానికి రూ. 5000 వేలు కూడా లేనివ్యక్తి.. నేడు రూ. 16,900 కోట్లకు అధిపతి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News