Janhvi Kapoor: 13 సంవత్సరాలకే పోర్న్ సైట్ లో.. జాన్వి కపూర్ సెన్సేషనల్ వ్యాఖ్యలు

Janhvi Kapoor Upcoming Movie: శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఈ క్రమంలో ఈ హీరోయిన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 19, 2024, 10:57 AM IST
Janhvi Kapoor: 13 సంవత్సరాలకే పోర్న్ సైట్ లో.. జాన్వి కపూర్ సెన్సేషనల్ వ్యాఖ్యలు

Janhvi Kapoor in Devara: ధడక్ సినిమాతో బాలీవుడ్ లోకి  అడుగుపెట్టిన హీరోయిన్ జాన్వి కపూర్. బోనీ కపూర్,‌ శ్రీదేవి కూతురైన జాన్వి కపూర్ కి తెలుగులో కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇప్పటివరకు తెలుగులో ఈ హీరోయిన్ చిత్రం ఒకటి కూడా విడుదల కాకపోయినా.. తాను శ్రీదేవి కూతురు కావడం వల్ల సినిమాల్లోకి రాకముందే గుర్తింపు తెచ్చుకోండి. ఈ క్రమంలో ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేస్తాను దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది ఈ హీరోయిన్. 

ఇక మొదటి సినిమా విడుదల కాకముందే తన రెండో సినిమా కూడా తెలుగులో ఫిక్స్ చేసుకుంది. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో కూడా జాన్వి కపూర్ హీరోయిన్ గా చేయనుంది. మరోపక్క హిందీలో సైతం వరస సినిమాలతో బిజీగా ఉండి ఈ హీరోయిన్. 

జాన్వీ, రాజ్ కుమార్ రావు నటించిన మిస్టర్ అండ్ మిసెస్ మహి అనే చిత్రం మే 31న విడుదలకు సిద్ధంగా ఉంది. కాగా ఈ చిత్ర ప్రమోషన్స్ లో తెగ యక్టివ్ గా పాల్గొంటుంది ఈ హీరోయిన్. ఈ క్రమంలో ఈ హీరోయిన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు అందరినీ షాప్ కి గురి చేశాయి. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు కేవలం 13 సంవత్సరాలు వయస్సు ఉన్నప్పుడే తన ఫోటోలని పోర్న్ సైట్ లో పెట్టి దుష్ప్రచారం చేశారని చెప్పుకొచ్చింది జాన్వి. ‘కొందరు ఆకతాయిలు నా ఫోటోలని నాకు 13 సంవత్సరాలు ఉన్నప్పుడు పోర్న్ సైట్ లో పెట్టారు. శ్రీదేవి కూతురు అని ఎంతో అసభ్యంగా ఆ ఫోటోలను వైరల్ చేశారు. ఆ ఫోటోలని నా ఫ్రెండ్స్ కూడా చూశారు. నేను స్కూల్ కి వెళితే ఎంతో అవహేళనగా మాట్లాడేవారు. ఆ వయసులో వాటి గురించి నాకు అసలు అవగాహన కూడా లేదు. నన్ను ఎందుకు ఎగతాళి చేస్తున్నారో, ట్రోల్ చేస్తున్నారో అనే విషయం కూడా నాకు అర్థం అయ్యేది కాదు’ అని చెప్పుకొచ్చింది.

‘నన్ను వారు బాడీ షేమింగ్ కి గురిచేశారు. ఆ విమర్శలు ట్రోలింగ్ తట్టుకుని ఇప్పుడు స్ట్రాంగ్ గా మారాను. ఇప్పుడు ఎలాంటి విమర్శలు నాకు ఎదురైనా.. ట్రోలింగ్ జరిగినా నేను భరించగలను. కానీ నా కుటుంబ సభ్యులని ట్రోల్ చేస్తే మాత్రం నేను అసలు తట్టుకోలేను. అది నా వీక్ నెస్’ అని తెలియజేసింది ఈ హీరోయిన్.

Also Read: Low Depression: బంగాళాఖాతంలో అల్పపీడన హెచ్చరిక, ఏపీలో అతి భారీ వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News