Kajal Agarwal: నేను బాగా ఏడ్చాను.. అందుకే హీరోయిన్ అయ్యాను.. కాజల్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు

Kajal Agarwal Upcoming Movies: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చందమామ అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు కాజల్ అగర్వాల్. కాగా తెలుగులో స్టార్ హీరోయిన్గా ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఈ హీరోయిన్.. అసలు తనకి మొదటి సినిమాలో ఛాన్స్ ఎలా వచ్చిందో చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.  

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 10, 2024, 01:20 PM IST
Kajal Agarwal: నేను బాగా ఏడ్చాను.. అందుకే హీరోయిన్ అయ్యాను.. కాజల్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు

Kajal Agarwal About Her First Film: రెండు దశాబ్దాలకు పైగా స్టార్ హీరోయిన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూ వస్తున్న నటి కాజల్ అగర్వాల్. తన కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే.. పెళ్లి చేసుకొని.. ఒక బిడ్డకు జన్మనిచ్చి.. సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చింది. అయితే మరలా బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి తాను ఇంకా చందమామలానే ఉన్నాను అని రుజువుచేసుకుంది. ప్రస్తుతం ఈ హీరోయిన్ త్వరలోనే సత్యభామ అనే చిత్రంలో కనిపించనుంది. అంతేకాకుండా శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ రూపొందిస్తున్న ఇండియన్ 2 చిత్రంలో కూడా కాజల్ అగర్వాల్ హీరోయిన్ పాత్రలో కనిపించనుంది. ఈ క్రమంలో కాజల్ అసలు తనకు తన మొదటి సినిమా ఛాన్స్ ఎలా వచ్చిందో చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.

హిందీలో కొన్ని సినిమాలలో చిన్న క్యారెక్టర్ చేసిన కాజల్ తెలుగులో హీరోయిన్ గా పరిచయమైన చిత్రం లక్ష్మీ కళ్యాణం. తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ హీరోగా నటించారు. ఈ సినిమాలో కాజల్ పల్లెటూరి అమ్మాయిల కనిపించి అందరిని మెప్పించింది. అయితే ఈ సినిమా ఛాన్స్ దక్కించుకోవడానికి కాజల్ ఏమి చేసిందంటే.. కేవలం చాలాసేపు ఏడ్చిందట. అవును.. మీరు విన్నది నిజమే. ఈ విషయం కొంచెం ఆశ్చర్యానికి గురిచేస్తున్న.. ఇదే నిజమంటూ అసలు విషయం చెప్పుకొచ్చింది ఈ హీరోయిన్.

సత్యభామ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కాజల్ ఈ మధ్యనే ఆలీతో సరదాగా ప్రోగ్రాం కి అటెండ్ అయ్యింది.
ఆ సందర్భంగా అలీ తో కాజల్‌ పలు విషయాల గురించి మాట్లాడింది. ముఖ్యంగా తన మొదటి సినిమా ఆఫర్‌ ఎలా వచ్చింది.. అందుకోసం తాను ఆడిషన్ లో ఏమి చేసింది అనే విషయాన్ని సరదాగా చెప్పుకొచ్చింది ఈ హీరోయిన్.

తేజ దర్శకత్వంలో లక్ష్మి కళ్యాణం చిత్రంలో మీకు ఛాన్స్ ఎలా వచ్చింది అని అలీ ప్రశ్నించగా.. కాజల్ సమాధానమిస్తూ... ‘ దర్శకుడు తేజ గారు నా ఫోటో చూసి ఆడిషన్స్ కి పిలిచారు. ఆడిషన్స్ లో నన్ను ఏం అడుగుతారా అని నేను చాలా ఎదురుచూశాను. అయితే సమయంలో నన్ను కేవలం ఏడవమని చెప్పాను. రీజన్‌ లేకుండా, ఏడ్చే ఫీలింగ్ లేకుండా ఎలా ఏడవడం అని నేను చాలా సేపు అనుకున్నాను. అప్పుడు మా నాన్న నా వద్దకు వచ్చి నేను నిజంగానే ఏడ్చే ఒక విషయాన్ని చెప్పారు. అప్పుడు నాకు ఏడుపు వచ్చింది. నేను బాగా ఏడ్చాను అని తేజ గారు వెంటనే లక్ష్మి కళ్యాణం సినిమాలో ఛాన్స్ ఇచ్చారు’ అని కాజల్‌ సరదాగా చెప్పుకొచ్చింది. హీరోయిన్‌ లను తేజ గారు ఎంపిక చేసే విధానం చాలా విభిన్నంగా ఉంటుందని కూడా కాజల్ చెప్పుకొచ్చింది.

కాగా లక్ష్మీ కళ్యాణం సినిమాలో కాజల్ క్యారెక్టర్ ఎక్కువసేపు ఏడుస్తూనే ఉంటుంది అన్న విషయం మనకు తెలిసిందే. ఆ క్యారెక్టర్ కి ఏడవదమే ముఖ్యం కాబట్టి.. తేజ అలా ఆదేశం చేసి ఉంటారని తమాషాగా కామెంట్లు పెడుతున్నారు నేటిజన్స్.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News