Kannappa: ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్‌ కోసం ఈ విషయం.. కథ చెప్పగానే ఆ మాట అన్నారు: విష్ణు మంచు

Manchu Vishnu: మంచు విష్ణు హీరోగా వస్తున్న కన్నప్ప సినిమా పైన తెలుగు ప్రేక్షకుల అంచనాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. భారీ తారాగణంతో రాబోతున్న ఈ సినిమా నుంచి ఎప్పుడెప్పుడు ఎటువంటి అప్డేట్ వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా గురించి హీరో విష్ణు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 11, 2024, 07:29 PM IST
Kannappa: ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్‌ కోసం ఈ విషయం.. కథ చెప్పగానే ఆ మాట అన్నారు: విష్ణు మంచు

Manchu Vishnu Kannappa Update: భారీ పాన్ ఇండియా సినిమాల విషయం పక్కనపెడితే..ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ చూపు మొత్తం విష్ణు మంచు కన్నప్ప సినిమా పైనే ఉంది. ఇందుకు ముఖ్య కారణం ఈ సినిమా బడ్జెట్ అలానే తారాగణం రోజు రోజుకి పెరుగుతూ పోవడమే. తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ అని చెబుతూ వచ్చిన మంచు విష్ణు.. నిజంగానే ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించడానికి సర్వవిధాల ప్రయత్నిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా యూనిట్ మొత్తం కృషి చేస్తుందని ఈ చిత్రం నుంచి వస్తున్న అప్డేట్స్ చూస్తేనే అర్థమవుతుంది. ఈ చిత్రం నుంచి వచ్చే ప్రతీ అప్డేట్ ఎంతగా వైరల్ అవుతోందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ మధ్యనే ప్రభాస్ షూటింగ్లోకి అడుగుపెట్టారు అంటూ రిలీజ్ అయిన శివుడి పోస్టర్ సోషల్ మీడియాలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ పోస్టర్ తో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఈ క్రమంలో ఈ సినిమా గురించి విష్ణు మంచు ఇచ్చిన మరొక అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. విష్ణు మంచు తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఓ వీడియోను షేర్ చేశారు. అందులో ఏముందంటే..

‘కన్నప్ప నుంచి న్యూస్ ఎప్పుడు వచ్చినా.. తెలుగు ప్రేక్షకులు అందరూ ఎంతో ఆత్రుతగా చూస్తుంటారు. ఇప్పుడు దాకా వచ్చిన ఐదారు అప్డేట్లు కూడా టాప్‌లో ట్రెండ్ అయ్యాయి. నా మిత్రుడు ప్రభాస్ షూట్‌లో జాయిన్ అయ్యాడని చెప్పిన వార్త దేశ వ్యాప్తంగా ట్రెండ్ అయింది. దాదాపు 18 గంటల పాటు సోషల్ మీడియాలో ఆ వార్త ట్రెండ్ అయింది. కన్నప్పలో మహామహులు నటిస్తున్నారు. ఈ కథలో చాలా గొప్ప పాత్రలున్నాయి. ఆ పాత్రలను అద్భుతమైన ఆర్టిస్టులు పోషిస్తున్నారు.

ప్రభాస్ ఫ్యాన్స్‌కి, డై హార్డ్ ఫ్యాన్స్‌ కోసం ఈ విషయం చెబుతున్నాను. కన్నప్ప సినిమాను నేను చేస్తున్నా..నువ్వు ఒక కారెక్టర్ చేయాలని ప్రభాస్‌కు చెప్పాను. ‘కథ బాగా నచ్చింది నాకు ఈ పాత్ర ఇంకా బాగా నచ్చింది.. ఈ కారెక్టర్‌ను నేను చేయొచ్చా?’ అని ప్రభాస్ అడిగారు. ఏ కారెక్టర్‌ అయితే ప్రభాస్‌కు బాగా నచ్చిందో అదే పాత్రను ప్రభాస్ పోషించారు. ఒక్కో పాత్రను మీ ముందుకు తీసుకొస్తాను. అధికారికంగా ఆ పాత్రలను గురించి మేం చెప్పినప్పుడే నమ్మండి. బయట వచ్చే వాటిని నమ్మకండి. త్వరలోనే అన్ని పాత్రల గురించి ప్రకటిస్తాం. సోమవారం నాడు మీకు అద్భుతమైన అప్డేట్ ఇవ్వబోతున్నాము’ అని అన్నారు.

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌ అయిన ఈ కన్నప్పను మోహన్ బాబు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కెమెరామెన్‌గా ప్రఖ్యాత హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ, యాక్షన్ డైరెక్టర్ కెచా ఖంపక్డీతో సహా ఆకట్టుకునే అద్భుతమైన టీం పనిచేస్తోంది. ఆకర్షణీయమైన విజువల్స్, అద్భుతమైన కథ, కథనాలతో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read more: Romance In Metro: మెట్రోలో హాట్ రోమాన్స్.. యువకుడిని గట్టిగా హత్తుకుని ముద్దులు.. వీడియో వైరల్...

Read more: Ayodhya Ram lalla: ద్యావుడా.. అయోధ్యలో భక్తులకు తిలకం పెడుతూ బాలుడు ఈ రేంజ్ లో సంపాదిస్తున్నాడా..?.. వైరల్ వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News