10years for Manam: రీ-రిలీజ్ కానున్న నాగచైతన్య, సమంత సినిమా.. అక్కినేని ఫ్యాన్స్ కి పండగే

Manam Re-release: అక్కినేని ఫ్యామిలీకి ఎంతో ప్రత్యేకమైన చిత్రం మనం. ఈ సినిమా పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ చిత్ర మేకర్స్ ఈ సినిమాని రీ-రిలీజ్ చేయబోతున్నారు.. ఆ వివరాలు మీకోసం..  

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 8, 2024, 02:03 PM IST
10years for Manam: రీ-రిలీజ్ కానున్న నాగచైతన్య, సమంత సినిమా.. అక్కినేని ఫ్యాన్స్ కి పండగే

Naga Chaitanya -Samantha: అక్కినేని ఫ్యామిలీకి ఎంతో ప్రత్యేకమైన సినిమా మనం. మూడు తరాల హీరోలు ఈ సినిమాలో కనిపించి మెప్పించారు. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్ నటించిన ఈ చిత్రం వారి కుటుంబానికి ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా. అక్కినేని అభిమానుల మదిలో కూడా ఈ చిత్రం ఎప్పటికీ నిలిచిపోతుంది. విక్రమ్ కే కుమర్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో నాగచైతన్య మాజీ భార్య సమంత కూడా నటించడం విశేషం. ఇక ఈ సినిమాలో అమలా కూడా చిన్న గెస్ట్ పాత్రలో కనిపించింది. అన్నిటికన్నా ఎక్కువగా ఇది నాగేశ్వరరావు చివరి చిత్రం. ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ సినిమా విడుదలై 10 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు సినిమా యూనిట్.

ఈ విషయాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ వారు రెండు రోజుల క్రితం తమ ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేశారు. 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మనం సినిమాని మే 23వ తేదీన విడుదల చేయనుందామని తెలియజేశారు సినిమా యూనిట్. ఇక ఈ వార్త విని అక్కినేని అభిమానులు ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నారు. 

ఈ సినిమాని అప్పుడప్పుడు థియేటర్స్ లో చూద్దామా అని తెగ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో నాగచైతన్య కి జోడిగా సమంత నటించగా.. నాగార్జున కి జోడిగా శ్రియ నటించింది. సిసింద్రీ తరువాత ఈ సినిమాతోనే అఖిల్ మొదటిసారి వెండి తెరపై కనిపించాడు. ఈ చిత్రంలో నాగార్జునకి తండ్రిగా నాగచైతన్య.. నాగేశ్వరరావుకి తండ్రిగా నాగార్జున... నటించడం అప్పట్లో అక్కినేని అభిమానులను తెగ అలరించింది. అక్కినేని అభిమానులకే కాకుండా తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ సినిమా ఎంతగానో నచ్చడంతో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.

మరి ప్రస్తుతం ఏ చిత్ర విడుదలలు లేకపోవడంతో మనం రీరిలీజ్ కూడా మంచి విజయం సాధించి.. సూపర్ కలెక్షన్స్ సొంతం చేసుకుంటుందేమో వేచి చూడాలి.

 

Also Read: Noise Watch: రూ.4,999ల Noise Icon వాచ్‌ ఇప్పుడు కేవలం రూ.949కే పొందండి.. పూర్తి వివరాలు ఇవే!

Also Read: Rashmi Gautam: ట్రోలర్ కి రష్మీ షాకింగ్ రిప్లై.. రేపు నీ పిల్లలని చంపుతాడు జాగ్రత్త

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News