Salaar2: సలార్ 2 లో స్టార్ హీరోయిన్.. అది కూడా ఎంతో ముఖ్యమైన పాత్రలో

Salaar 2 Update: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సలార్ పార్ట్ 1 ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సలార్ పార్ట్ 2 సినిమా కోసం అభిమానులు ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Apr 25, 2024, 05:06 PM IST
Salaar2: సలార్ 2 లో స్టార్ హీరోయిన్.. అది కూడా ఎంతో ముఖ్యమైన పాత్రలో

Prabhas Salaar 2 : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా సలార్. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అంచనాలకు మించి కలెక్షన్లు అందుకొని బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్యాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన ఈ సినిమా అన్నీ భాషల్లోనూ సూపర్ హిట్ గానే నిలిచింది. 
ఈ సినిమాకి రెండవ భాగంగా ఇప్పుడు సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వం త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ సినిమా కోసం అభిమానులు కళ్ళుకాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. వారి కోసమే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికమైన అప్డేట్ బయటకు వచ్చింది.

అది ఏమిటి అంటే బాలీవుడ్ హీరోయిన్ కియారా ఈ చిత్రంలో ఒక ముఖ్య పాత్రలో కనిపించనిందట. శృతిహాసన్ తో పాటు ఈ హీరోయిన్ కూడా రెండో భాగంలో ఎంతో కీలకమైన పాత్ర చేయనుంది అని వినికిడి. ఇప్పటికే మహేష్ బాబు భరత్ అనే నేను, రామ్ చరణ్ వినయ విధేయ రామ చిత్రాలలో కనిపించిన ఈ హీరోయిన్ ఇప్పుడు సలార్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మరోసారి పలకరించానంది. ఇక ఈ సినిమాలోనే కాకుండా ఆల్రెడీ ఈ నటి రామ్ చరణ్ గేమ్ చేంజర్ లో కూడా నటిస్తోంది.

ఇక గత కొద్ది రోజులుగా ప్రశాంత్ నీల్ సలార్ పార్ట్ 2 సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం సలార్ 2 సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తి కావచ్చాయట. త్వరలోనే ప్రశాంత్ నీల్ ప్రభాస్ ను కలిసి సినిమాకి సంబంధించిన డైలాగ్ వర్షన్ స్క్రిప్ట్ ఫైనల్ నేరేషన్ ఇవ్వబోతున్నారట.

ప్రభాస్ తో పాటు సినిమా లో నటించబోతున్న మరికొందరు నటులు కూడా ఈ నేరేషన్ లో పాల్గొనబోతున్నారు. ప్రశాంత్ నీల్ వారికి సినిమాకి సంబంధించిన పూర్తి స్క్రిప్ట్ డైలాగ్స్ తో సహా నేరేట్ చేయనున్నారు. ఇక ఇదంతా అవ్వగానే ఈ సినిమా చివరి షెడ్యూల్ పూర్తి చేసుకోనుందని తెలుస్తోంది.

ఇక ఈ చిత్ర విషయానికి వస్తే శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రియారెడ్డి, బాబీ సింహ, పృథ్విరాజ్ సుకుమారన్ తదితర స్టార్ యాక్టర్స్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. హోంబాలే ఫిలిమ్స్ వారు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.  సలార్ పార్ట్ 1 సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది కాబట్టి రెండవ భాగం కూడా భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేయనుంది అని చెప్పుకోవచ్చు. ఇక సలార్ పార్ట్ 2 ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వనుంది అని ఫ్యాన్స్ ఇప్పటినుండే జోస్యం చెబుతున్నారు. 

ప్రభాస్ మిగతా సినిమాలతో కూడా బిజీగా ఉన్నారు. ప్రభాస్ కల్కి సినిమా షూట్ పూర్తిచేసుకొని నిర్మాణాంతర పనుల స్టేజ్ లో ఉంది. మరోవైపు రాజాసాబ్ కూడా షూటింగ్ పూర్తిచేసుకుంటే ప్రశాంత్ నీల్ సలార్ 2 షూట్ 2025 లో మొదలుపెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు.

Also Read: KCR On CM Revanth Reddy: ఏం చేస్తవ్ చడ్డీ గుంజుకుని.. సీఎం రేవంత్ మీద  పంచ్ లు కురిపించిన గులాబీబాస్..

Also Read: Renault Kiger Price: టాటా పంచ్‌తో పోటీ పడుతున్న Renault Kiger.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇలా! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News