Shoaib Malik : మరో యువతికి గాలం వేస్తున్న సానియా మాజీ భర్త..?.. రొమాంటిక్ మెస్సెజ్ లపై లీకులు..

Shoaib Malik Flirty Texts:సానియా మీర్జా మాజీ భర్త షోయబ్ మాలీక్ మరోసారి వార్తలలో నిలిచారు. ఆయన ఇటీవల కాలంలో ఒక పాక్ ఫెమస్ నటికి తరచుగా రొమాంటిక్ సందేశాలు పంపిస్తున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అదే విధంగా ఆ యాక్ట్రెస్ నావల్ సయిద్ ఇటీవల ఒక ఇంటర్య్వూలో చేసిన వ్యాఖ్యలు దీనికి మరింత బలంచూకూరేవిగా మారాయి.

Written by - Inamdar Paresh | Last Updated : Apr 5, 2024, 06:05 PM IST
  • పాక్ ఫెమస్ నటికి సానియా మాజీ భర్త మెస్సెజ్ లు..
  • ఆ నంబర్లను బ్లాక్ చేశానన్న నావల్ సయిద్..
Shoaib Malik : మరో యువతికి గాలం వేస్తున్న సానియా మాజీ భర్త..?.. రొమాంటిక్ మెస్సెజ్ లపై లీకులు..

Sania Ex Husband Flirty Texts To Pak Actor Nawal Saeed: పాకిస్థాన్ ఫెమస్ యాక్ట్రెస్ నవాల్ సయిద్ ఇటీవల పాక్ లో లైఫ్ గ్రీన్ హై అనే షో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అదే విధంగా ఆ సమయంలో హోస్ట్ చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఆ సమయంలో హెస్ట్ మాట్లాడుతూ.. మీకుఎవరైన అబ్బాయిలు లవ్ ప్రపోజల్ చేశారా.., ప్రేమించారా.. అంటూ అడిగారు. అదేవిధంగా నవాల్ సయిద్ తనకు కొన్నిరోజులుగా పెళ్లైన క్రికెటర్ ల నుంచి రొమాంటిక్ వస్తున్నాయని కూడా చెప్పారు. ఇంతలో హోస్ట్.. షోయబ్ మాలీక్ అని అడగ్గా.. లేదు.. మర్చిపోయానంటూ నవ్వుతూ నవాల్ సయిద్ మాటమార్చేశారు. ఇదిలా ఉండగా.. హోస్ట్ ఆ మెసెజ్ లలో ఏముందని అడగ్గా, ఆమె చెప్పడానికి అంతగా ఇష్టపడలేదు. మిమ్మల్ని పొగుడుతూ మెసెజ్ చేశారా అని అడిగారు. దీంతో ఆమె దీనిపై క్రికెటర్లను ఎందరో రోల్ మోడల్ గా తీసుకుంటారని, ఆరాధిస్తారని కూడా చెప్పింది. అలాంటి వారు ఇలాంటి పనులు చేస్తారని అనుకోలేదని ఇండైరెక్ట్‌ గా లీకులు ఇచ్చారు. అప్పటి నుంచి ఇలాంటి నంబర్లను బ్లాక్ చేశానని కూడా తెల్చిచెప్పారు.

Read More: Woman Kisses King Cobra: ఇదేంది రా నాయన.. పాముతో లిప్ లాక్.. నెట్టింట వైరల్ గా మారిన వీడియో..

సదరు వ్యక్తితో ఎక్కడికైన బైటకు డేటింగ్ కు వెళ్లారా.. అని అడగ్గా అదేంలేదని.. నవాల్ సయిద్ కొట్టిపారేశారు. ఇదిలా ఉండగా.. ఆమె చెప్పిన కొన్ని విషయాలను బట్టి ఈ పనిచేసింది షోయబ్ మాలీక్ అయి ఉండోచ్చని కూడా రూమర్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉండగా.. కొన్ని నెలల క్రితమే షోయబ్ మాలీక్, సానియా మీర్జాకు డైవర్స్ ఇచ్చేసి, సనా జావేద్ ను పెళ్లాడిన విషయం తెలిసిందే. షోయబ్ మాలీక్, సనా ల పెళ్లి జరిగి కేవలం మూడు నెలలు మాత్రమే గడుస్తోంది.

ఈ క్రమంలో షోయబ్ మరో అమ్మాయికి రొమాంటిక్ మెస్సెజ్ లు పంపడం పై వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ , పాక్  ఫెమస్ నటీ సనా జావేద్, జనవరి 20, 2024న లో వీరి పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుండి, ఇద్దరూ తమ వివాహాలతో పాటు,  వారి గతంలో జరిగిన వివాహాల గురించి వార్తల్లో ఉన్నారు.

Read more: Chocolate Banana Dosa: వావ్.. యమ్మీ యమ్మీ.. చాక్లెట్ బనానా దోశ.. వైరల్ గా మారిన వీడియో..

షోయబ్ గతంలో సానియా మీర్జాను వివాహం చేసుకున్నాడు. సనా మాజీ భర్త పాకిస్థానీ గాయకుడు-గేయరచయిత ఉమైర్ జస్వాల్. సానియా , షోయబ్ 2010లో వివాహం చేసుకున్నారు. వీరికి 2018లో జన్మించిన వారి కుమారుడు ఇజాన్ మీర్జా మాలిక్‌కు సహ-తల్లిదండ్రులు. సనా 2020లో ఉమైర్ జస్వాల్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News