Ala Ninnu Cheri: ఓటీటీలో హెబ్బా పటేల్ ‘అలా నిన్ను చేరి’.. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్

Ala Ninnu Cheri OTT Platform: అలా నిన్ను చేరి మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో ఆడియన్స్‌ను అలరించిన ఈ మూవీ.. తాజాగా ఓటీటీ ప్రేక్షకుల ప్రశంసలు కూడా అందుకుంటోంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 23, 2023, 08:22 PM IST
Ala Ninnu Cheri: ఓటీటీలో హెబ్బా పటేల్ ‘అలా నిన్ను చేరి’.. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్

Ala Ninnu Cheri OTT Platform: దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రల్లో మారేష్ శివన్ దర్శకత్వం రూపొందిన మూవీ అలా నిన్ను చేరి. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మించారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా.. రీసెంట్‌గా థియేటర్లలో ఆడియన్స్‌ను మెప్పించింది. విమర్శకుల ప్రశంసలతో పాటుగా ప్రేక్షకుల మన్ననలు పొందింది. తాజాగా ఓటీటీలో సందడి చేస్తోంది. అమెజాన్ ప్రైమ్‌లో అలా నిన్ను చేరి మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్యామిలీ అండ్ యూత్ ఆడియన్స్ నుంచి ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మారేష్ శివన్ కథ, కథనం, డైరెక్షన్‌ ఆకట్టుకుంది. ఈ మూవీలో డైలాగ్స్‌కు ప్రేక్షకుల గుండెలకు హత్తుక్కున్నాయి.
 
హుషారు మూవీ సూపర్ హిట్ తరువాత మళ్లీ దినేష్ తేజ్‌కు ఆ రేంజ్‌లో సక్సెస్ వచ్చింది. దినేష్ తేజ్‌కు యాక్టింగ్‌కు మంచి మార్కులు పడ్డాయి. పాయల్ రాధాకృష్ణ, హెబ్బా పటేల్ అందాలు, యాక్టింగ్ సినిమాకు మరింత ప్లస్ అయ్యాయి. మహబూబ్ బాషా, మహేష్ ఆచంట, చమ్మక్ చంద్ర తమ పాత్రలకు న్యాయం చేస్తూ.. ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్వించారు. ఐ ఆండ్రూ సినిమాటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ మూవీ టైటిల్ సాంగ్ కూడా ఆడియన్స్‌కు తెగనచ్చేసింది. ప్రేక్షకుల అభిరుచికి తగినట్లు మంచి విజువల్స్‌లో షూట్ చేశారు. ఈ సాంగ్ లిరిక్స్‌ను ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ రాయగా.. సుభాష్‌ ఆనంద్ మ్యూజిక్ అందించారు. ఎంతో ఆహ్లాదకరమైన లొకేషన్స్‌లో సాంగ్‌ను షూట్ చేశారు. హీరోహీరోయిన్ మధ్య కెమిస్ట్రీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయింది. గ్రామీణ నేపథ్యంలో సాగిన ఈ సాంగ్‌తోపాటు అన్ని పాటలను చంద్రబోస్ రాశారు. సుభాష్ ఆనంద్ మ్యూజిక్ సినిమాకు బలంగా మారింది. కర్నాటి రాంబాబు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించగా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా పనిచేశారు. ఇలాంటి అలా నిన్ను చేరి చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్‌‌లో చూడాలని మేకర్స్ కోరుతున్నారు. 

Also Read: Hardik Pandya: ఐపీఎల్ 2024కు హార్దిక్ పాండ్యా దూరం, తిరిగి కెప్టెన్సీ రోహిత్‌కేనా

Also Read: Ind vs SA Test Series: సఫారీ గడ్డపై టెస్ట్ సిరీస్, ఇద్దరు మినహా సీనియర్ల టీమ్ రెడీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News