సావిత్రి గెటప్‌లో కీర్తిసురేష్.. సోషల్ మీడియాలో కొత్త ఫోటో హల్చల్

"మహానటి" పేరుతో అలనాటి మేటి కథానాయిక సావిత్రి నిజ జీవితకథను సినిమాగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 

Last Updated : May 5, 2018, 07:27 PM IST
సావిత్రి గెటప్‌లో కీర్తిసురేష్.. సోషల్ మీడియాలో కొత్త ఫోటో హల్చల్

"మహానటి" పేరుతో అలనాటి మేటి కథానాయిక సావిత్రి నిజ జీవితకథను సినిమాగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో టైటిల్ పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుండగా.. ఇతర పాత్రల్లో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, సమంత, క్రిష్, అవసరాల శ్రీనివాస్ మొదలైనవారు నటిస్తున్నారు. మే 9వ తేదిన ‘మహానటి’ చిత్రం విడుదల కానుండటంతో ఇప్పటికే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా పలు పోస్టర్స్ కూడా విడుదల చేస్తున్నారు నిర్మాతలు.

అలా విడుదలైన ఓ పోస్టరులోని వైవిధ్యమైన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆ ఫోటోలో కీర్తి సురేష్ అచ్చం సావిత్రికి జెరాక్స్ కాపీలా ఉండడంతో అభిమానులు ఇప్పటికే ఫిదా అయిపోయారు. మాయాబజార్ చిత్రంలోని మాయా శశిరేఖ స్టిల్‌లో అచ్చం సావిత్రి ఎలా కనబడతారో.. అదే స్టిల్‌లో కీర్తి సురేష్‌కి మేకప్ వేయడం విశేషం

 

Trending News