మహానటి: ఎస్వీ రంగారావుగా మోహన్ బాబు

అలనాటి అందాల నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘మహానటి'.

Last Updated : May 7, 2018, 08:17 AM IST
మహానటి: ఎస్వీ రంగారావుగా మోహన్ బాబు

అలనాటి అందాల నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘మహానటి'. ఈ నెల 9న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. టైటిల్ రోల్‌లో కీర్తి సురేష్ నటించారు. జెమినీ గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ కనిపించే ఈ చిత్రంలో సమంత అక్కినేని, విజయ్ దేవరకొండ కీలక పాత్రలు పోషించారు. ఈసినిమాలో ఎల్వీ ప్రసాద్‌గా అవసరాల శ్రీనివాస్, కేవీ రెడ్డిగా క్రిష్ కనిపించనున్నారంటూ ప్రకటించిన మూవీ యూనిట్ శనివారం నాని చేతుల మీదుగా వీడియోలను విడుదల చేసింది. ఆదివారం ఎస్వీ రంగారావు పాత్రకు సంబంధించిన ప్రచార చిత్రాన్ని పంచుకుంది. ఇందులో మోహన్ బాబు అచ్చం ఎస్వీ రంగారావుగా కనిపించి, ఆకట్టుకున్నారు.

 

ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో నాగ చైతన్య నటించగా, డా.రాజేంద్రప్రసాద్, ప్రకాష్ రాజ్, శాలిని పాండే, మాళవికా నాయర్, భానుప్రియ, దివ్యవాణి, తరుణ్ భాస్కర్ ఇతర ముఖ్యపాత్రల‌లో క‌నిపించ‌నున్నారు. సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి చిత్రానికి దర్శకుడు నాగ్ అశ్విన్ కాగా.. ఈ చిత్రాన్ని ప్రియాంక దత్ స్వప్న సినిమాస్, వైజయంతి మూవీస్ బ్యానర్‌లపై నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్.

Trending News