How To Reduce Cholesterol: ఇలా కొలెస్ట్రాల్‌ వెన్నలా కరిగి, సైజ్‌ జీరో అవ్వడం ఖాయం.!

How To Reduce Cholesterol In 7 Days: ప్రస్తుతం చాలా మంది కొలెస్ట్రాల్‌ పెరగడం, మధుమేహం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ ఈ కింది ఆయుర్వేద గుణాలు కలిగిన టీలను తాగితే అన్ని రకాల అనారోగ్య సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 24, 2023, 09:11 AM IST
How To Reduce Cholesterol: ఇలా కొలెస్ట్రాల్‌ వెన్నలా కరిగి, సైజ్‌ జీరో అవ్వడం ఖాయం.!

How To Reduce Cholesterol In 7 Days: ప్రస్తుతం చాలా మందిలో అధిక కొలెస్ట్రాల్, మధుమేహం తీవ్రమైన వ్యాధులుగా మారుతున్నాయి.  దీని కారణంగా అనేక ఇతర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. అంతేకాకుండా కొందరిలో కొలెస్ట్రాల్ పరిమాణాలు పెరగడం కారణంగా మరణిస్తున్నారు. అయితే పై రెండు తీవ్ర సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకుంటే ప్రాణాలకే ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా అధిక కొలెస్ట్రాల్, మధుమేహం వంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా జీవన శైలితో పాటు, ఆహారంలో పలు రకాల మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.

వీటిని తప్పకుండా ఆహారంగా తీసుకోవాల్సి ఉంటుంది:
ప్రకృతి మనకు అనేక రకాల ఆకులు ఉంటాయి. వీటన్నిటి గురించి ఆయుర్వేద శాస్త్రంలో క్లుప్తంగా పేర్కోన్నారు. ముఖ్యంగా ఆకు కూరల్లో శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఖనిజాలు, కాల్షియం, ఫైబర్, ప్రోటీన్ వంటి ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి. కాబట్టి వీటిని తినడం వల్ల అనారోగ్య సమస్యలతో పాటు కొలెస్ట్రాల్ కూడా సులభంగా కరుగుతుందని ఆరోగ్య నిపుణుతు తెలుపుతున్నారు.

పుదీనా ఆకులు:
వేసవి కాలంలో పుదీనా ఆకులను ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. చెరకు రసం, నిమ్మరసంలో ఈ ఆకులను తీసుకోవడం వల్ల రుచితో పాటు శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి కీలక పాత్ర పోషిస్తుంది. ఇలా కలుపుకుని ప్రతి రోజూ తాగడం వల్ల మధుమేహంతో పాటు అధిక కొలెస్ట్రాల్‌ సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి.

వేప ఆకులు:
వేప ఆకుల్లో చాలా రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. దాని ఆకులు, బెరడు, పండ్లను కూడా అనేకు అనారోగ్య సమస్యలకు వినియోగిస్తారు. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. కాబట్టి వీటి ఆకులను ప్రతి రోజూ వినియోగిస్తే..ఎల్‌డిఎల్‌తో పాటు రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి.

కరివేపాకు:
సౌత్ ఇండియన్ వంటకాల్లో కరివేపాకులను విచ్చలవిడిగా వినియోగిస్తారు. ఇది వంటకాల రుచిని పెంచడమేకాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. ఈ ఆకులో యాంటీ బాక్టీరియల్, యాంటీమైక్రోబయల్ లక్షణాలు లభిస్తాయి. కాబట్టి సులభంగా కొలెస్ట్రాల్‌ స్థాయిలను నియంత్రిస్తుంది.

తులసి:
తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రతి ఇంట్లో తులసి మొక్కలు ఉంటాయి. దీనికి ఆయుర్వేద శాస్త్రంలో మంచి ఔషధ మొక్కగా పరిగణించారు. అయితే ఈ ఆకులతో  డికాక్షన్ తయారు చేసుకుని తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా శరీర బరువు కూడా తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Earthquak Today: ఢిల్లీ, చెన్నై నగరాల్లో భూకంపం.. భయాందోళనలో ప్రజలు

Also Read: Earthquak Today: ఢిల్లీ, చెన్నై నగరాల్లో భూకంపం.. భయాందోళనలో ప్రజలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News