High Cholesterol: మీ శరీరంలో కొలెస్ట్రాల్‌ పెరిగిందా?, రక్తంలో కొవ్వు తగ్గడానికి ఇలా చేయండి చాలు!

High Cholesterol: శరీరంలో కొలెస్ట్రాల్‌ పరిమాణాలు అధికంగా పెరగడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యల వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈ భాగాల్లో నొప్పులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 18, 2023, 04:10 PM IST
High Cholesterol: మీ శరీరంలో కొలెస్ట్రాల్‌ పెరిగిందా?, రక్తంలో కొవ్వు తగ్గడానికి ఇలా చేయండి చాలు!

High Cholesterol: ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మంది కొలెస్ట్రాల్‌ సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో చాలా మంది  అధిక రక్తపోటు, మధుమేహం, గుండెపోటు, కరోనరీ ఆర్టరీ వ్యాధి, ట్రిపుల్ నాళాల వ్యాధి వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. కాబట్టి కొలెస్ట్రాల్ పెరిగిన వారిలో ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఇలాంటి సమస్యలు ఉంటే నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి తప్పకుండా తీసుకునే ఆహారాలపై పలు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది.

కొలెస్ట్రాల్ అంటే ఏమిటి?
శరీరంలో కొలెస్ట్రాల్‌ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మంచి కొలెస్ట్రాల్‌ అయితే, రెండవది మంచి కొలెస్ట్రాల్‌. అయితే శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ ఉంటే ఆరోగ్యంగా ఉంటారు. కానీ చెడు కొవ్వుల పరిమాణాలు అధికంగా పేరుకుపోతే తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మధుమేహం సమస్యలు రావొచ్చని నిపుణులు చెబుతున్నారు.

Also Read:  Karnataka Assembly Elections 2023: బీజేపీకి భారీ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన మాజీ ముఖ్యమంత్రి

రక్తంలో కొలెస్ట్రాల్ ఎంత ఉండాలి?
ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని పెద్దల్లో 200 mg / dl వరకు కొలెస్ట్రాల్ పరిమాణాలు ఉండాలి. 240 mg / dl కంటే స్థాయిలు దాటితే తప్పకుండా తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడతారు. కాబట్టి తప్పకుండా జీవనశైలిలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యకరమైన అలవాట్లే చేసుకోవాలి.

ఈ భాగాల్లో నొప్పులు ఉంటే కొలెస్ట్రాల్ పెరినట్లేనా?:
పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ (PAD) కారణంగా శరీరంలో రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది. వ్యాయామాలు చేయడం వల్ల తీవ్ర నొప్పులు వస్తే శరీరంలో కొలెస్ట్రాల్‌ పరిమాణాలు పెరిగినట్లేనని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కొలెస్ట్రాల్‌లను ఎప్పుడు తనిఖీ చేసుకోవాల్సి ఉంటుంది.

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read:  Karnataka Assembly Elections 2023: బీజేపీకి భారీ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన మాజీ ముఖ్యమంత్రి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News