Rajasthan Accident: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు పోలీసులు దుర్మరణం..

Accident in Nagaur: రాజస్థాన్‌లో విషాదం చోటుచేసుకుంది. పోలీసు వాహనం ట్రక్కును ఢీకొన్న ఘటనలో ఐదుగురు అధికారులు దుర్మరణం చెందారు. ఈ ఘటన నాగౌర్ జిల్లాలో జరిగింది. 

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 19, 2023, 12:40 PM IST
Rajasthan Accident: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు పోలీసులు దుర్మరణం..

Rajasthan road accident: రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Accident in Nagapur) జరిగింది. ఇవాళ ఉదయం కారు.. ట్రక్కును ఢీకొన్న ఘటనలో ఐదుగురు పోలీసులు మరణించారు. ఈ ప్రమాదంలో ముగ్గురు పోలీసులు గాయపడగా వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ విషాద ఘటన నాగౌర్ జిల్లా కనుటా గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. పోలీసు వాహనం ఝుంజునులో ప్రధాని ర్యాలీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.   అయితే అందుతున్న సమాచారం ప్రకారం, మరణించిన పోలీసులంతా  ఖిన్వ్‌సర్ పోలీస్ స్టేషన్ అధికారులుగా తెలుస్తోంది.

రాజస్థాన్ సీఎం సంతాపం 
నాగౌర్‌ ప్రమాదంపై  రాజస్థాన్‌ సీఎం అశోక్ గెహ్లాట్ సంతాపం ప్రకటించారు. ఈ ప్రమాదంలో మరణించిన పోలీసులందరి కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు సీఎం. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. 

ఝుంజునులో పర్యటించనున్న ప్రధాని..
ఆదివారం మధ్యాహ్నం జరిగే బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు.  ఝుంజునులో  ప్రధాని పర్యటించడం ఇది మూడోసారి. ఘటనా స్థలంలో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ప్రధాని మోదీ సభను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంది. మధ్యాహ్నం తారానగర్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఝుంఝుకు చేరుకుంటారు. ఇప్పటికే జాతీయ కార్యదర్శి ఓంప్రకాష్ ధంఖర్.. ప్రధాని మోదీ సభా స్థలాన్ని పరిశీలించేందుకు ఝుంజును చేరుకున్నారు. ప్రస్తుతం జిల్లాకు చెందిన అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ, ఇతర అధికారులతో సహా ఉన్నతాధికారులందరూ ఘటనా స్థలంలో ఉన్నారు.

Also Read: Indian Army Operation: జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఆరుగురు ఉగ్రవాదులు హతం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News