Ayodhya Ram Mandir: అయోధ్యలో ఘనంగా ముగిసిన బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం..

Ayodhya Ram Mandir: దేశ వ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా అందరి నోటా శ్రీ రామ నామమే మారుమోగుతోంది.5 శతాబ్డాల సుధీర్ఘ నిరీక్షణ. ఎన్నో దశాబ్దాల పోరాటాలు వెరసి అయోధ్యలో భవ్య రామ మందిరం కల సాకారం అయింది. అయోధ్యలోని  శ్రీరామ్ లల్లా ( బాలరాముని) విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమము ఘనంగా జరిగింది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 22, 2024, 01:40 PM IST
Ayodhya Ram Mandir: అయోధ్యలో ఘనంగా ముగిసిన బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం..

Ayodhya Ram Mandir: అయోధ్యలో భవ్య రామ మందిరంలో శ్రీ రాముడు బాల రాముడిగా కొలువైనాడు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతులు మీదుగా ఆలయంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది. ముందుగా నిర్ణయించిన అభిజిత్ ముహూర్తంలోనే బాల రాముడు కొలువైనాడు. అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం ఎన్నో శతాబ్దాల కల. ఎన్నో దశాబ్దాల పోరాట ఫలితం. ఈ రోజు భవ్య రామ మందిరంలో బాల రాముడుగా ఆ కోదండ రాముడు కొలువు తీరడంతో రామ భక్తుల చిరకాల కోరిక నెవరేరింది. ఈ అద్భుత క్షణాల కోసం ఎంతో మంది రామ భక్తులు ఎన్నో శతాబ్డాలుగా ఎదురు చూసారు.

త్రేతా యుగంలో 14 యేళ్లు వనవాసం చేసిన రామయ్య.. ఈ కలియుగంలో తను పుట్టిన అయోధ్యలో కొలువు తీరడానికి ఐదు వందల యేళ్లు పోరాటాలు చేస్తే కానీ కొలువు తీరలేదు. మొత్తంగా సుదీర్ఘంగా కొనసాగిన ఈ ప్రస్థానం నేటి ప్రాణ ప్రతిష్ఠతో ముగిసింది. ఒక రకంగా ఈ కలియుగంలో జరిగిన అతిపెద్ద మహా క్రతువుగా అభివర్ణించాలి. నేడు జరిగిన అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులకు రామజన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్టు ప్రత్యేకంగా ఆహ్వానాలు పలికిన సంగతి తెలిసిందే కదా. రేపటి నుండి (జనవరి 23) నుండి సామాన్య భక్తులకు రామ్ లల్లా దర్శనం ఇవ్వనున్నారు.

ఇక ప్రధాన ఆలయానికి భక్తులు చేరుకోవడానికి 32 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. అయోధ్య ప్రధాన ఆలయాన్ని సంప్రదాయ నాగరశైలిలో నిర్మించారు. 380 అడుగుల పొడువు.. 250 అడుగుల వెడల్పు.. 161 అడుగుల ఎత్తుతో నిర్మించారు.ప్రతి అంతస్తు 20 అడుగుల ఎత్తు ఉంది. మొత్తం 392 స్తంభాలు.. 44 గేట్లు ఉన్నాయి.

Also Read: Suryavanshi Thakur: ఐదు వందల ఏళ్ల తర్వాత నెరవేరిన శపథం.. పట్టువదలని సూర్యవంశి ఠాకూర్‌ వంశీయులు

Also Read: APCC Chief YS Sharmila: తొలి రోజే స్వరాష్ట్రం ఏపీలో వైఎస్‌ షర్మిలకు ఘోర అవమానం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News