Babri Masjid demolition case: 30న బాబ్రీ కేసు తీర్పు

28 ఏళ్ల నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసుపై ఈనెల 30న తీర్పు వెలువడనుంది. దాదాపు రెండేళ్లనుంచి రోజువారీ విచారణను చేపట్టిన సీబీఐ ప్రత్యేక ధర్మాసనం తీర్పు ప్రకటించడానికి సంసిద్ధమైంది. అయితే తీర్పు రోజున ఈ కేసులో నిందితులుగా ఉన్న వారంతా కోర్టుకు హాజరుకావాలని సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎస్‌కే యాదవ్‌ ఆదేశించారు. 

Last Updated : Sep 16, 2020, 05:44 PM IST
Babri Masjid demolition case: 30న బాబ్రీ కేసు తీర్పు

CBI Special court deliver verdict in Babri case on Sep 30: లక్నో: 28 ఏళ్ల నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసు (Babri Masjid demolition case) పై ఈనెల 30న తీర్పు వెలువడనుంది. దాదాపు రెండేళ్లనుంచి రోజువారీ విచారణను చేపట్టిన సీబీఐ ప్రత్యేక ధర్మాసనం తీర్పు ప్రకటించడానికి సంసిద్ధమైంది. అయితే తీర్పు రోజున ఈ కేసులో నిందితులుగా ఉన్న వారంతా కోర్టు (CBI Special court) కు హాజరుకావాలని సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎస్‌కే యాదవ్‌ ఆదేశించారు. బాబ్రీ మసీదు కూల్చివేతపై సీబీఐ 351 మంది సాక్షులను, 600 డాక్యుమెంటరీ పత్రాలను కోర్టు ముందు కోర్టు ముందు ఉంచింది. అయితే సెప్టెంబరు 1న డిఫెన్స్ అండ్ ప్రాసిక్యూషన్ వాదనలు ముగిశాయని, ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పును సిద్ధం చేస్తున్నట్లు సీబీఐ న్యాయవాది లలిత్ సింగ్ ప్రకటించారు. అయితే ఈ కేసుకు సంబంధించి బీజేపీ (BJP) అగ్రనేతలు అద్వానీ, ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషి, ఉమాభారతి, మురళీ మనోహర్ జోషి తదితరులు ఇటీవల వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణకు హాజరైన విషయం తెలిసిందే. Also read: Sputnik-V vaccine : ఆర్‌డీఐఎఫ్‌తో డా. రెడ్డీస్ ఒప్పందం.. భారత్‌లో ‘స్పూత్నిక్ వీ’ ట్రయల్స్

1992 డిసెంబరు 6న యూపీలోని అయోధ్యలో కరసేవకులు బాబ్రీ మసీదు కూల్చివేసిన కేసులో 32మంది నిందితులుగా ఉన్నారు. వారిలో బీజేపీ అగ్రనేతలు  లాల్ కృష్ణ అద్వానీ (Lal Krishna Advani), ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషి, అశోక్ సింఘాల్, ఉమాభార‌తి, కల్యాణ్‌ సింగ్, వినయ్ కటియార్ త‌దిత‌రులు నిందితులుగా ఉన్నారు. అయితే ఈ కేసును రెండేండ్ల‌లో విచారణ పూర్తిచేసి తీర్పు వెలువరించాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని 2017లో సుప్రీంకోర్టు ఆదేశించింది. అప్పటినుంచి ప్రత్యేక కోర్టు రోజూవారి విచారణను చేపట్టింది. 2019 జులైలో ఆ గడువు ముగియ‌డంతో మరో 9 నెలలపాటు పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చింది. అయితే ఆ గ‌డువును 2020 మేలో మరోసారి ఆగస్టు 31వరకు పొడిగించింది. అయితే ఈ కేసులో తీర్పు వెలువరించేందుకు మరింత సమయం కావాలని సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సుప్రీంను అభ్యర్థించగా.. సెప్టెంబరు 30 నాటికి తీర్పును వెలువరించాలంటూ జస్టిస్‌ రొహింటన్‌ నారీమన్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రత్యేక కోర్టు సెప్టెంబరు 30న తీర్పును వెలువరించేందుకు సిద్ధమైంది. Also read: Babri Masjid demolition case: బాబ్రీ కేసులో తీర్పునకు ‘సుప్రీం’ కొత్త డెడ్‌లైన్

Trending News