Heavy Rain Alert: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం, ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు

Heavy Rain Alert: దేశంలో ఈ ఏడాది అసాధారణ వర్షపాతం నమోదు కానుంది. మొన్నటి వరకూ భారీ వర్షాలతో కుదేలైన దేశంలోని పలు రాష్ట్రాలు మరోసారి భారీ వర్షాల గుప్పిట్లో చిక్కుకోనున్నాయి. రానున్న 5 రోజులు దేశంలోని పలు రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 1, 2023, 04:34 PM IST
Heavy Rain Alert: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం, ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు

Heavy Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పటికే తీవ్ర అల్పపీడనంగా మారింది. ఫలితంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో రానున్న 5 రోజులు భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ హెచ్చరించింది. మొత్తానికి ఈ ఏడాది అసాధారణ వర్షపాతం నమోదు కానుందని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి ప్రస్తుతం బంగ్లాదేశ్ తీరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది గంటకు 25 కిలోమీటర్ల వేగంగా ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది. ఫలితంగా ఆగస్టు 3 నుంచి 6వ తేదీ వరకూ వాయువ్య బారతదేశంలో వర్షపాతం పెరగనుంది. ఇక మహారాష్ట్ర, కొంకణ్ తీరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. మరోవైపు పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్‌గఢ్, జార్ఘండ్, బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఇవాళ్టి నుంచి 5 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. దీంతో  దేశంలోని తూర్పు రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, జార్ఘండ్, బీహార్‌లలో తలెత్తిన వర్షపాతం‌లోటు అదిగమించవచ్చు. 

ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వర్షపాతం ఈ ప్రాంతాల్లో సాధారణంగానే ఉంటుందని, ఆ తరువాత 94 నుంచి 106 శాతం ఉంటుందని ఐఎండీ  అంచనా వేస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. జూన్‌లో ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల్ని జూలైలో కురిసిన భారీ వర్షాలు తీర్చేశాయి. జూలై నెలలో 13 శాతం ఎక్కువగా వర్షపాతం కురిసింది. 

ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారడంతో ఒడిశా , ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని..మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ సూచించింది. 

Also read: Polavaram project: పోలవరంపై ఏపీకు గుడ్‌న్యూస్, ఇక ఆ నిధులు కూడా ఇచ్చేందుకు సుముఖత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News