AP Telangana Summer Updates: నిప్పుల కుంపటిగా తెలుగు రాష్ట్రాలు, రానున్న 4 రోజులు రెడ్ అలర్ట్

AP Telangana Summer Updates: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ నెలంతా సాధారణం కంటే 4-5 డిగ్రీలు అధికంగా నమోదై ఆందోళన కల్గించాయి ఇప్పుడు మే నెలలో పరిస్థితి మరింత దయనీయంగా ఉండవచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 1, 2024, 07:12 AM IST
AP Telangana Summer Updates: నిప్పుల కుంపటిగా తెలుగు రాష్ట్రాలు, రానున్న 4 రోజులు రెడ్ అలర్ట్

AP Telangana Summer Updates: ఓ వైపు వడగాల్పులు, మరోవైపు అధిక ఉష్ణోగ్రతలతో ఏప్రిల్ నెలంతా భారంగా గడిచింది. ఏప్రిల్ నెలలో వందేళ్ల చరిత్రలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో 45-46 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రత నమోదవడం తీవ్రంగా భయపెట్టింది. రోజురోజుకూ పెరుగుతున్న ఎండల తీవ్రత, వడగాలులతో జనం అల్లాడిపోతున్నారు. రానున్న 4-5 రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని ఐఎండీ వెల్లడించింది. 

ఏపీలోని వివిధ జిల్లాల్లో రానున్న 3 రోజులు వాతావరణం ఇలా

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఇవాళ మే 1, మే 2 తేదీల్లో రాష్ట్రంలోని 34 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 216 మండలాల్లో వడగాల్పులు వీయనున్నాయి. మే 2వ తేదీన 30 మండలాల్లో తీవ్రంగానూ, 149 మండలాల్లో సాధారణంగానూ వేడిగాలులు వీయనున్నాయి. అదే సమయంలో పగటి ఉష్ణోగ్రతలు కూడా భారీగా పెరగనున్నాయి. ఏలూరు,  కృష్ణా, ఎన్టీఆర్, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, పల్నాడు, ప్రకాశం, నెల్లూురు , తిరుపతి, కడప జిల్లాల్లో 45-47 డిగ్రీల వరకూ చేరవచ్చని తెలుస్తోంది. ఇక తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, బాపట్ల జిల్లాల్లో 44-45 డిగ్రీలకు చేరుకోవచ్చు. ఇక విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, సత్యసాయి జిల్లాల్లో అయితే 42-44 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రత ఉండవచ్చు. 

మే 3వ తేదీన కడప, నెల్లూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో 45-47 డిగ్రీలు నమోదు కావచ్చు. ఏలూరు, కృష్ణ, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, గుంటూరు, కృష్ణ, ఎన్టీఆర్, బాపట్ల, కర్నూలు, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 42-45 డిగ్రీల వరకూ ఉండవచ్చు. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 40-42 డిగ్రీలు ఉండవచ్చు.

తెలంగాణలో

తెలంగాణలోని వివిధ జిల్లాల్లో నిన్న అంటే మంగళవారం అత్యధికంగా 45 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రత నమోదైంది. సిద్ధిపేటలోని థూల్ మిట్ట, నల్గొండలోని నాంపల్లి, జగిత్యాలలోని వెల్లటూరులో 45.9 డిగ్రీలు నమోదైంది. నల్గొండలోని తెలిదేవరపల్లిలో 45.8 డ్గీరులు, మంచిర్యాలలోని జన్నారం, నర్శాపురం ప్రాంతాల్లో 45.7 డిగ్రీలు నమోదైంది. అటు వడగాల్పులు కూడా తీవ్రంగా వీస్తున్నాయి. రానున్న 3-4 రోజులు పరిస్థితి మరింత విషమించవచ్చని తెలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో రానున్న మూడ్రోజులు పగటి ఉష్ణోగ్రత 3-4 డిగ్రీలు పెరగవచ్చని తెలుస్తోంది. 

Also read: TDP-Janasena Manifesto: టీడీపీ-జనసేన మేనిఫెస్టో విడుదల.. అదిరిపోయే హామీలు ప్రకటన

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News