నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూని మళ్లీ పాకిస్తాన్‌కు ఆహ్వానించిన ఇమ్రాన్ ఖాన్ !

నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూని మళ్లీ పాకిస్తాన్‌కు ఆహ్వానించిన ఇమ్రాన్ ఖాన్ !

Last Updated : Nov 24, 2018, 05:05 PM IST
నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూని మళ్లీ పాకిస్తాన్‌కు ఆహ్వానించిన ఇమ్రాన్ ఖాన్ !

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆహ్వానం మేరకు ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరై అక్కడ పాక్ ఆర్మీ చీఫ్ ఖమర్ జావేద్ బజ్వాను ఆప్యాయంగా కౌగిలించుకున్నందుకు ప్రముఖ క్రికెటర్ పంజాబ్ రాష్ట్ర మంత్రి నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ భారత్‌లో అధికార పార్టీ బీజేపీ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కున్న సంగతి తెలిసిందే. అప్పటి ఘటనపై నేటికి తీవ్ర ఆరోపణలు ఎదుర్కుంటున్న నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూకి ఆ ఘటన మర్చిపోకముందే తాజాగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నుంచి మరోసారి ఆహ్వానం అందింది. కర్తాపూర్ సరిహద్దు కారిడార్ శంకుస్థాపన మహోత్సవానికి హాజరు కావాల్సిందిగా తన స్నేహితుడు ఇమ్రాన్ ఖాన్ నుంచి తనకు మరోసారి ఆహ్వానం అందిందని, తాను సంతోషంగానే అతడి ఆహ్వానాన్ని స్వీకరించి అక్కడికి వెళ్లబోతున్నానని తాజాగా నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ స్పష్టంచేశారు. 

బాబా గురునానక్ (సిక్కు మతస్తుల ఆరాధ్య దైవం) దయవల్ల రెండు దేశాలు కలిసిపోయే రోజు వస్తుందని ఆశాభావం వ్యక్తంచేసిన నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ... కోట్లాది మంది ప్రార్థనలు ఫలించే రోజు వచ్చిందని అన్నారు. తన స్నేహితుడు ఇమ్రాన్ ఖాన్ పిలుపు మేరకు తాను పాకిస్తాన్ వెళ్లేందుకు సిద్ధపడ్డట్టు తెలిపిన నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ.. ఈ ప్రయత్నం కారణంగా ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు మళ్లీ మెరుగుపడతాయని, అలాగే నెత్తుటి క్రీడకు అంతం పలికేందుకు నాంది పలికినట్టవుతుందని అభిప్రాయపడ్డారు. 
 

Trending News