Lok Sabha Polls 2024 2nd Phase: సాఫీగా ముగిసిన రెండో దశ పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే.. ?

Lok Sabha Polls 2024 2nd Phase: దేశ వ్యాప్తంగా రెండో దశ పోలింగ్ శుక్రవారం సాఫీగా ముగిసింది. ఏదో కొన్ని చెదురు మొదురు ఘటనలు మినహా పోలింగ్ ఆసాంతం సాఫీగా సాగిపోయింది. రెండో దశలో 13 రాష్ట్రాల.. కేంద్ర పాలిత ప్రాంతాల్లో 89 స్థానాలకు కాను 88 లోక్ సభ సీట్లకు పోలింగ్ జరిగింది. పోలింగ్ శాతాన్ని అర్ధరాత్రి దాటిన తర్వాత ఈసీ ప్రకటించింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 27, 2024, 07:16 AM IST
Lok Sabha Polls 2024 2nd Phase: సాఫీగా ముగిసిన రెండో దశ పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే.. ?

Lok Sabha Polls 2024 2nd Phase:  దేశ వ్యాప్తంగా 543 లోక్‌సభ ఎన్నికల్లో మొదటి, రెండు విడతల్లో ఎన్నికలు సాఫీగా సాగాయి.  
రెండో విడత ఎన్నికలతో   దేశ వ్యాప్తంగా 190స్థానాలకు ఎన్నికల ప్రక్రియ కంప్లీటైంది. మరో ఐదు విడతల్లో 353 లోక్ సభ  స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల్లో రెండో విడతలో భాగంగా కర్ణాటకలోని 14 స్థానాలు.. కేరళలోలని 20 సీట్లతో పాటు దేశ వ్యాప్తంగా 13 రాష్ట్రాలు.. కేంద్ర పాలిత ప్రాంతాల్లో 89 సీట్లకు పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో ప్రజలు ఓటింగ్ కేంద్రాలకు పోటెత్తారు. రాత్రి 8 గంటల వరకు 63.5 శాతం నమోదు అయిందని ఎలక్షన్ కమిషన్ పేర్కొంది. రాత్రి పొద్దు పోయే వరకు దాదాపు 70 శాతం వరకు పోలింగ్ జరిగినట్టు సమాచారం.

ఈ సారి ఎన్నికల్లో కేరళలోని 20 స్థానాలు, కర్ణాటకలోని 14 స్థానాలు.. రాజస్థాన్‌లోని 13, అస్సామ్‌, బిహార్‌లోని 5 స్థానాలు..మధ్య ప్రదేశ్‌లోని 7 స్థానాలకు గాను 6 స్థానాలకు మాత్రమే పోలింగ్ జరిగింది. మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్‌లోని లోని 8 స్థానాలు.. వెస్ట్ బెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌లోని 3 స్థానాలు..
జమ్మూ కశ్మీర్‌లో జమ్మూ స్థానానికి, త్రిపుర, మణిపూర్‌లోని ఒక్కో స్థానానికి ఎన్నికలు జరిగాయి.  ఈ విడతతో కేరళ, రాజస్థాన్‌, అస్సామ్ ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తైయింది.  

నిన్న ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు  జరిగింది. ఎండ తీవ్రత కారణంగా చాలా మంది వృద్దులు, పెద్దలు సాయంత్రి పొద్దుపోయాకా ఓటింగ్ కేంద్రాలకు బారులు తీరారు. దీంతో చాలా చోట్ల రాత్రి వరకు లైన్‌లో ఉన్నవారికి ఓటు వేయడానికి ఎన్నికల అధికారులు అవకాశం కల్పించారు. రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ఎండలు మాడు పగిలేలా ఉన్న.. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తడం విశేషం.

ఈ ఎన్నికల్లో త్రిపురలో అత్యధికంగా 79.46 శాతం పోలింగ్ నమోదు అయింది. అతి తక్కువగా బిహార్‌లో 55.08 శాతంగా ఉంది.   రెండో దశలో 89 స్థానాల్లో 88 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌లో బరిలో ఉన్న బీఎస్పీ అభ్యర్ధి మరణంతో ఆ స్థానానికి మే 7న  ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఈసీ ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లో ఓ ప్రభుత్వ స్కూల్లో డ్యూటీ చేస్తోన్న జవాన్ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చకుని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది.  మణిపూర్‌లో కట్టుదిట్టమైన భద్రత నడమ పోలింగ్ జరిగింది. ఆ రాష్ట్రంలో 77.32 శాతం పోలింగ్ నమోదు అయినట్టు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఇక బిహార్, యూపీ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత  కారణంగా ఈసీ అధికారులు ఓటర్ల కోసం ప్రత్యేకంగా షామియానాలు, మంచి నీళ్ల వంటివి ఏర్పాటు చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్, కాంకేర్ పార్లమెంట్ పరిధిలోని 46 గ్రామ ప్రజల కోసం తొలిసారి ఆయా గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓటర్లు కూడా ఎంతో ఉత్సాహాంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. రెండో దశ పూర్తైయిన తర్వాత ప్రధాని ఎక్స్ వేదికగా స్పందిస్తూ రెండో దశ చాలా బాగా పూర్తయింది. ఎన్‌డీఏకు మంచి ఫలితాలు రాబోతున్నట్టు చెప్పారు. అదే విధంగా ప్రతిపక్షాలకు ఇది నిరాత్సపరిచే అంశం అన్నారు.

ఐదో దశలో భాగంగా శుక్రవారం లోక్ సభ ఐదో దశ నోటిఫికేషన్ విడుదల చేసింది. 8 రాష్ట్రాల్లోని 49 నియోజకవర్గాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మే 20న పోలింగ్ జరగనుంది. ఈ దశలో యూపీలో అమేథి, రాయబరేలి వంటి కీలక స్థానాలున్నాయి. శుక్రవారం నుంచి నామినేషన్లు స్వీకరించడం మొదలు పెట్టింది ఈసీ. మే 3 నామినేషన్లకు చివరి తేది. మే 4న నామినేషన్ల పరిశీలన ఉంటుంది.

Also Read: Hyderabad Weather Report: హైదరాబాద్‌ నగరంలో భానుడి ఉగ్రరూపం.. ఈ ఆరు ప్రాంతాల్లో రికార్డుస్థాయిలో ఎండలు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News