Free Electricity: ప్రతినెలా 300 యూనిట్ల ఉచిత విద్యుత్.. కొత్త పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ.. 

Pm Surya Ghar: సౌరశక్తి, స్థిరమైన పురోగతిని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం 'పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ పథకం' ప్రారంభిస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ప్రకటించారు. దేశంలోని ప్రజలకు ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించడానికి ఈ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించినట్ ఎక్స్ వేధికగా ప్రకటించారు.

Written by - Renuka Godugu | Last Updated : Feb 13, 2024, 03:37 PM IST
Free Electricity: ప్రతినెలా 300 యూనిట్ల ఉచిత విద్యుత్.. కొత్త పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ.. 

Pm Surya Ghar: సౌరశక్తి, స్థిరమైన పురోగతిని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం 'పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ పథకం' ప్రారంభిస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ప్రకటించారు. దేశంలోని ప్రజలకు ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించడానికి ఈ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.  ఈ పథకం ద్వారా ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించడం ద్వారా కోటి ఇళ్లకు విద్యుత్‌ను అందజేస్తుంది. ఈ ప్రాజెక్టులో రూ. 75,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రధాని మోదీ తెలిపారు. ఇళ్లపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసి సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచుతామన్నారు

సబ్సిడీల నుంచి భారీ రాయితీతో కూడిన బ్యాంకు రుణాల వరకు ప్రజలపై ఎలాంటి వ్యయ భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తుందని ప్రధాని మోదీ అన్నారు. వాటాదారులందరూ జాతీయ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా అనుసందానం చేస్తారు. ఇది మరింత సౌకర్యాన్ని అందిస్తుంది. సబ్సిడీని నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాల్లోకి జమచేస్తామని చెప్పారు.

ఈ పథకాన్ని అట్టడుగు స్థాయి నుంచి ప్రాచుర్యం పొందేందుకు పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీలు తమ అధికార పరిధిలో రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌లను ప్రోత్సహించేలా ఏర్పాటు చేయనున్నారు. ఈ పథకం ప్రజలకు ఎక్కువ ఆదాయాన్ని తక్కువ విద్యుత్ బిల్లులను, ఉపాధిని అందిస్తుంది. ప్రజల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా అందజేసే రాయితీల నుంచి భారీ రాయితీతో కూడిన బ్యాంకు రుణాల వరకు ప్రజలపై ఎలాంటి భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తుందని ప్రధాని మోదీ అన్నారు.

 

సోలార్ ఎనర్జీని, సుస్థిర ప్రగతిని ప్రోత్సహిద్దాం అని మోదీ అన్నారు. https://pmsuryagarh.gov.in లో దరఖాస్తు చేసి ప్రధానమంత్రి సూర్య ఘర్: ఉచిత విద్యుత్ పథకాన్ని బలోపేతం చేయాలని నేను అన్ని నివాస వినియోగదారులను, ముఖ్యంగా యువతను కోరుతున్నాను అని ట్వీట్ చేశారు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News