PNB Scam: పీఎన్‌బీ స్కాంలో కీలక పరిణామం, అప్రూవర్లుగా నీరవ్ మోదీ సోదరి, బావ

PNB Scam: భారతీయ బ్యాంకింగ్ రంగంపై తీవ్రమైన దుష్ప్రభావాని చూపించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కీలకమైన సాక్ష్యాలతో అప్రూవర్లుగా మారుతామంటూ ప్రధాన నిందితుడు నీరవ్ మోదీ సోదరి, బావ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Last Updated : Jan 6, 2021, 10:50 PM IST
  • పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో కీలక పరిణామం
  • అప్రూవర్లుగా మారేందుకు సిద్ధమైన ప్రధాన నిందితుడు నీరవ్ మోదీ సోదరి పూర్వి మోదీ, బావ
  • ప్రస్తుతం లండన్ జైళ్లో ఉన్న నీరవ్ మోదీ
PNB Scam: పీఎన్‌బీ స్కాంలో కీలక పరిణామం, అప్రూవర్లుగా నీరవ్ మోదీ సోదరి, బావ

PNB Scam: భారతీయ బ్యాంకింగ్ రంగంపై తీవ్రమైన దుష్ప్రభావాని చూపించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కీలకమైన సాక్ష్యాలతో అప్రూవర్లుగా మారుతామంటూ ప్రధాన నిందితుడు నీరవ్ మోదీ సోదరి, బావ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పీఎన్‌బీ స్కాం ( PNB Scam )..పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం ( Punjab national bank scam ) దేశ బ్యాంకింగ్ రంగాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. కేసులో ప్రధాన నిందితుడు , వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ( Nirav modi ) తప్పుడు పత్రాలతో 14 వేల కోట్ల రుణం తీసుకుని బ్యాంకును ముంచేశాడు. తరువాత నెమ్మదిగా విదేశాలకు చెక్కేశాడు. 2019 మార్చ్ నెలలో భారత ప్రభుత్వ ( Indian Government ) అభ్యర్ధన మేరకు స్కాట్లండ్ పోలీసులు  ( Scotland police ) అరెస్టు చేయగా ప్రస్తుతం నీరవ్ మోదీ లండన్ జైళ్లో ఉన్నాడు. నీరవ్‌ను భారత్‌కు అప్పగించే అంశం ఇప్పుడు పరిశీలనలో ఉంది. 

ఇప్పుడీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితుడు నీరవ్ మోదీ నేర చరిత్ర మూలంగా తమ జీవితాలు నాశనమయ్యాయని నీరవ్ మోదీ సోదరి పూర్వి ( Nirav modi sister purvi ), ఆమె భర్త మయాంక్ మెహతా ( Nirva brother in law Meheta )లు సంచలన ఆరోపణలు చేశారు. కేసులో కీలకమైన సాక్ష్యాల్ని ఇస్తామని..అప్రూవర్లుగా మారేందుకు సిద్ధమని ప్రకటించారు. పీఎన్‌బీ స్కాం, నీరవ్ నుంచి తమను దూరం చేయాలని పూర్వి మోదీ, ఆమె భర్త మెహతాలు కోర్టును కూడా ఆశ్రయించారు. నీరవ్ మోదీ నేరపూరిత కార్యకలాపాల కారణంగా తమ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలు దెబ్బతిన్నాయని కోర్టు ముందు ఆవేదన చెందారు. దాంతో ప్రాసిక్యూషన్ సాక్షులుగా ముంబై ప్రత్యేక మనీ లాండరింగ్ కోర్టు ( Money laundering court ) అనుమతించింది. క్షమాపణలు తెలిపిన తరువాత నీరవ్ సోదరి పూర్వీ, ఆమె భర్తను అప్రూవర్లుగా అంగీకరించాలని కోర్టు తెలిపింది. ప్రస్తుతంత బెల్జియం పౌరసత్వంతో ఆదేశంలో ఉన్న పూర్వి మోదీపై ఈడీ అభియోగాలు నమోదు చేసి ఉంది. 

Also read: Bird flu outbreak: కలకలం రేపుతున్న బర్డ్ ఫ్లూ వైరస్, రాష్ట్రాల్ని అప్రమత్తం చేసిన కేంద్ర ప్రభుత్వం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News