Benefits Of Onion Water For Hair: ఉల్లిపాయ రసం ఇలా వాడితే జుట్టు వద్దన్నా పెరుగుతూనే ఉంటుంది..

Benefits Of Onion Water For Hair: హెయిర్‌ ఫాల్ సమస్య చాలామందిని వెంటాడుతుంది. చాలా మంది వివిధ రకాల జుట్టు ఉత్పత్తులకు డబ్బులు ఖర్చు పెడుతున్నారు.

Written by - Renuka Godugu | Last Updated : May 12, 2024, 05:58 PM IST
Benefits Of Onion Water For Hair: ఉల్లిపాయ రసం ఇలా వాడితే జుట్టు వద్దన్నా పెరుగుతూనే ఉంటుంది..

Benefits Of Onion Water For Hair: హెయిర్‌ ఫాల్ సమస్య చాలామందిని వెంటాడుతుంది. చాలా మంది వివిధ రకాల జుట్టు ఉత్పత్తులకు డబ్బులు ఖర్చు పెడుతున్నారు. అయినా కొన్ని సైడ్‌ ఎఫెక్ట్స్‌ వల్ల పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం లేకపోలేదు. అయితే, కొన్ని ఇంటి చిట్కాలతో జుట్టు సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు. అవేంటో తెలుసుకుందాం.

ఉల్లిపాయ మన ఇంట్లో ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. దీంతో మీ జుట్టు వద్దన్నా పెరుగుతూనే ఉంటుంది. దీంతో హెయిర్‌ బలపడుతుంది. డ్యాండ్రఫ్‌ రాకుండా జుట్టు బలంగా మారుతుంది. జుట్టు సంబంధిత సమలస్యల వల్ల చాలామందిలో జుట్టు పెరగకుండా ఉంటుంది. అయితే, మన ఇంట్లో ఎప్పుడూ అందుబాటులో ఉండే ఉల్లిపాయతో మీ జుట్టు వద్దన్నా పొడుగ్గా పెరుగుతుంది. ఇందులో మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. 

జుట్టు ఆరోగ్యం..
ప్రస్తుతం మార్కెట్లో వివిధ రకాల జుట్టు సంబంధిత ఉత్పత్తుల్లో ఉల్లిపాయ రసంతో తయారు చేసినవి కనిపిస్తున్నాయి. షాంపూ, కండీషనర్‌, సీరమ్‌ రూపంలో అందుబాటులో ఉన్నాయి. ఉల్లిపాయ రసం మీ జుట్టుకు అప్లై చేసుకోవడం వల్ల మెరుగ్గా పెరుగుతుంది. అంతేకాదు డ్యాండ్రఫ్‌, హెయిర్ ఫాల్‌, అలోపేసియా వంటి సమస్యలకు చెక్‌ పెడుతుంది.

జుట్టుపెరుగుదల..
ఆనియన్‌ జ్యూస్‌ లో ఎక్కువ మోతాదులో సల్పర్‌ ఉంఉటంది. మీ జుట్టుకుదళ్ల నుంచి మందంగా చేస్తుంది. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది. అంతేకాదు చర్మంపై కొల్లాజెన్‌ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఆరోగ్యవంతమైన స్కిన్ సెల్స్‌కు తోడ్పడుతుంది.

హెయిర్‌ ఫొలికల్స్‌..
ఉల్లిపాయ రసం మన జుట్టుకు తరచూ అప్లై చేయడం వల్ల హెయిర్‌ ఫొలికల్స్‌ దృఢపడతాయి. ఇది మన జట్టును లోతుగా పోషిస్తుంది. జుట్టును బలపరుస్తుంది. అంతేకాదు స్ల్పిట్ ఎండ్‌ సమస్యను రాకుండా నివారిస్తుంది.

ఇదీ చదవండి: ముఖం ట్యాన్‌ అయిపోయిందా? ఈ బెస్ట్‌ బీట్‌రూట్‌ ఫేస్‌ప్యాక్‌ వేయండి డీట్యాన్‌ అయిపోతుంది..

డ్యామేజ్‌ రిపెయిర్..
మార్కెట్లో లభిస్తున్న చాలా షాంపూల్లో ఉల్లిపాయ గుణాలు ఉంటున్నాయి. ఇవి జుట్టు డ్యామేజ్ అవ్వకుండా కాపాడతాయి. డ్యామేజ్ హెయిర్ను నివారిస్తుంది. జుట్టుకు పునరుజ్జీవనం అందిస్తుంది. ఉల్లిపాయతో సహజంగానే వేల ఖర్చు లేకుండా బాగా రిపెయిర్ చేస్తుంది. 

ఇదీ చదవండి: టమోటా, పసుపుతో ఈ ఫేస్‌ప్యాక్‌ తయారు చేసుకోండి.. మీ ముఖానికి గోల్డెన్‌ గ్లో..

మెరుపు..
అంతేకాదు ఉల్లిపాయరసం జుట్టుకు అప్లై చేసుకోవడం వల్ల జుట్టుకు సహజసిద్ధమైన మెరుపు వస్తుంది. ఇది జుట్టు కుదుళ్లకు బ్లడ్‌ సర్క్యూలేషన్ పెంచుతుంది. మీ జుట్టు ఒత్తుగా, పొడుగ్గా మెరుస్తూ ఆరోగ్యవంతంగా కనిపిస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News