Gulab Jal Benefits: రోజ్‌ వాటర్‌ మీ ముఖానికి అప్లై చేస్తే మచ్చలేని చందమామలా మెరిసిపోతారు..

Gulab Jal Benefits:రోజ్‌ వాటర్‌ను మనం సాధారణంగానే బ్యూటీ రొటీన్లో వినియోగిస్తాం. దీంతో మన ముఖం మెరిసిపోతుంది. రోజ్‌ వాటర్‌ను రోజపూల రెమ్మలతో తయారు చేస్తారు. అయితే, ఈ రోజ్‌ వాటర్‌ అన్ని రకాల చర్మాలకు సరిపోతుంది.

Written by - Renuka Godugu | Last Updated : May 14, 2024, 03:45 PM IST
Gulab Jal Benefits: రోజ్‌ వాటర్‌ మీ ముఖానికి అప్లై చేస్తే మచ్చలేని చందమామలా మెరిసిపోతారు..

Gulab Jal Benefits: రోజ్‌ వాటర్‌ను మనం సాధారణంగానే బ్యూటీ రొటీన్లో వినియోగిస్తాం. దీంతో మన ముఖం మెరిసిపోతుంది. రోజ్‌ వాటర్‌ను రోజపూల రెమ్మలతో తయారు చేస్తారు. అయితే, ఈ రోజ్‌ వాటర్‌ అన్ని రకాల చర్మాలకు సరిపోతుంది. రోజ్‌ వాటర్‌ను రకరకలా బ్యూటీ ఉత్పత్తుల్లో వినియోగిస్తారు.  దీంతో మీ ముఖం మెరుస్తూ కనిపిస్తుంది. 

హైడ్రేటింగ్ టోనర్...
రోజ్‌ వాటర్‌ను సాధారణంగానే టోనర్ లా వినియోగిస్తాం. అయితే, ఇది తరతరాలుగా బ్యూటీ ఉత్పత్తుల్లో ఉపయోగిస్తున్నారు. రోజ్‌ వాటర్ లో యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు పుష్కలంగా ఉంటాయి. రోజ్‌ వాటర్‌ మన చర్మానికి రోజంతటికీ కావాల్సిన తాజదనాన్ని అందిస్తుంది. అంతేకాదు ఇది పీహెచ్‌ స్థాయిలను నిర్వహిస్తుంది. రోజ్‌ వాటర్‌తో మీ ముఖాన్ని క్లెన్స్‌ చేసుకోవచ్చు. కాటన్‌ ప్యాడ్ సహాయంతో టోనర్ మాదిరి ముఖానికి అప్లై చేసుకోవాలి.

ఫేస్ మాస్క్..
రోజ్‌ వాటర్‌లో మరికొన్ని సహజసిద్ధమైన ఉత్పత్తులను ఉపయోగించి ఆరోగ్యకరమై ఫేస్‌ మాస్క్‌లను తయారు చేసుకోవచ్చు.  రోజ్‌ వాటర్‌ మన ముఖాన్ని మెరిపించి పునరుజ్జీవనాన్ని అందిస్తుంది.  ముఖం పై ఇన్ల్ఫమేషన్‌ రాకుండా నివారిస్తుంది. రోజ్‌ వాటర్, కలబంద , తేనె సహాయంతో మంచి మాస్క్‌ తయారు చేసుకోవాలి. సెన్సిటివ్‌ స్కిన్ వారు ఈ మాస్క్ వేసుకోవాలి.  దీన్ని గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడగాలి. 

రెండు టేబుల్‌ స్పూన్స్‌ రోజ్‌ వాటర్‌లో తేనె కలిపి మరో మాస్క్‌ ను కూడా తయారు చేసుకోవచ్చు. ఇది ముఖానికి మంచి క్లెన్సర్ మాదిరి పనిచస్తుంది. అంతేకాదు ఇందు చర్మానికి హాయినిచ్చే గుణాలు ఉంటాయి. మీ ముఖానికి ఈవెన్‌ టోన్ లభిస్తుంది. దీన్ని నార్మల్‌ వాటర్‌తో ఫేస్‌ వాష్ చేయాలి.

స్ట్రెస్‌..
రోజ్‌ వాటర్‌లో నయం చేసే గుణాలు ఉంటాయి. ఇందులోని అరోమా స్ట్రెస్‌ నుంచి ఉపశమనం కలిగి సతుంది. మనకు రిలాక్స్‌ ఇస్తుంది. రోజ్‌ వాటర్‌ను ముఖానికి అప్లై చేసుకునేటప్పుడు కాస్త దాని సువాసనను కూడా పీల్చుకోవాలి. 

ఇదీ చదవండి:  రోజ్మెరీతో మృదువైన, మెరిసే ముఖం మీ సొంతం.. ఇలా అప్లై చేయండి..

యాంటీ యాక్నే..
రోజ్‌ వాటర్ ముఖంపై యాక్నేకు చెక్ పెడుతుంది. యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలె ముఖం వాపును తగ్గిస్తుంది. రోజ్ వాటర్లో యాంటీ మైక్రోబియల్ గుణాలు బ్యాక్టిరియా ముఖంపై పెరగకుండా, యాక్నె రాకుండా నివారిస్తుంది. రోజ్‌ వాటర్‌లో మాయిశ్చర్ నిలిపే గుణాలు కూడా ఉంటాయి. అంతేకాదు ముఖం పొడిబారకుండా కాపాడుతుంది. 

సన్‌ బర్న్..
ఎండకాలం ముఖం సన్‌ డ్యామేజ్‌తో బాధపడుతుంటారు. రోజ్‌ వాటర్ యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉంటాయి. సన్‌ డ్యమేజ్‌ వల్ల ముఖం ఎర్రగా, ఇన్ల్ఫమేషన్‌ నుంచి నివారిస్తుంది. ఓ కాటన్ ప్యాడ్‌తో మీ ముఖం అంతటికీ అప్లై చేయండి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

ఇదీ చదవండి: మీ జుట్టు పొడుగ్గా పెరగాలంటే ఈ మ్యాజికల్ మాస్క్ అప్లై చేయండి..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News