Darshini Movie Review:'దర్శిని' మూవీ రివ్యూ.. ఆకట్టుకునే హార్రర్ థ్రిల్లర్..

Darshini Movie Review: సినీ ఇండస్ట్రీలో హార్రర్ చిత్రాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ కోవలో వచ్చిన చిత్రాలు ఆకట్టుకునే విధంగా ఉంటే ప్రేక్షకాదరణ ఉంటుంది. ఈ రూట్లోనే వచ్చిన మరో సినిమా 'దర్శిని'. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ఆకట్టుకుందా ? లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

Written by - ZH Telugu Desk | Last Updated : May 17, 2024, 06:30 PM IST
Darshini Movie Review:'దర్శిని' మూవీ రివ్యూ.. ఆకట్టుకునే హార్రర్ థ్రిల్లర్..

మూవీ రివ్యూ: దర్శిని (Darshini)
నటీనటులు: వికాస్, శాంతి ప్రియ, సత్య ప్రసాద్ తదితరులు
సినిమాటోగ్రఫీ: రవి మిల్కీ
ఎడిటర్ : ప్రవీణ్ జైరాజ్, చందు చలమల
సంగీతం : నిజాని అంజన్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : శివ ప్రసాద్
ప్రొడ్యూసర్ : డాక్టర్ ఎల్ వి సూర్యం
దర్శకుడు : డాక్టర్ ప్రదీప్ అల్లు

Darshini Movie Review: వికాస్, శాంతి ప్రియ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం 'దర్శిని'. వీ4 సినీ క్రియేషన్స్ పతాకంపై LV సూర్యం నిర్మించిన ఈ సినిమాను డాక్టర్ అల్లు ప్రదీప్ డైరెక్ట్ చేసారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టు ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

కథ విషయానికొస్తే..

సంతోష్(వికాస్), ప్రియ(శాంతిప్రియ), లివింగ్ స్టోన్(సత్య)ముగ్గురు మంచి స్నేహితులు. ముగ్గురూ కలిసి కొన్ని రోజులు ఔటింగ్ కి వెళదామని డాక్టర్ దర్శిని అనే సైంటిస్ట్ కి చెందిన ఫామ్ హౌస్ కి వెళ్తారు. అక్కడ ఈ ముగ్గురు తమ భవిష్యత్తుని చూపించే మిషిన్ చూస్తారు. భవిష్యత్తు చూపించే స్క్రీన్ పై చూసిందే తర్వాత రోజు.. జీవితంలో జరగడంతో ఎప్పుడైతే ఆ మిషిన్ యాక్టివేట్ అయిందో ప్రతి రోజు నెక్స్ట్ డే అదే టైంకి జరిగేదాన్ని చూపిస్తూ ఉంటుంది. వచ్చిన దగ్గర నుంచి డాక్టర్ దర్శిని కనిపించకపోవడంతో ఎక్కడుంది అని వెతుకుతుంటే అదే ఫామ్ హౌస్ లో దర్శిని శవంలా కనిపిస్తుంది. అదే సమయంలో ఓ పోలీస్ తన చెల్లి కనపడటం లేదని అక్కడకి వస్తాడు. ముగ్గురు ఫ్రెండ్స్ ని ఫోన్ చేసి ఎవరో బెదిరిస్తూ ఉంటారు. అసలు దర్శిని ఎలా చనిపోయింది? భవిష్యత్తు మిషిన్ లో వీళ్లకు ఏం కనిపించింది? ఈ ముగ్గుర్ని బెదిరించేది ఎవరు? ఆ భవిష్యత్తు మిషిన్ కథేంటి? పోలీస్ సిస్టర్ ఎవరు? ఆమెకు, మిషిన్ కి ఉన్న సంబంధం ఏంటి? ముగ్గురు ఫ్రెండ్స్ ఫామ్ హౌస్ నుంచి ఎలా తప్పించుకున్నారు అనేది వెండితెరపైత చూడాల్సిందే.

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
సస్పెన్స్ థ్రిల్లర్ కథకు సైన్స్ ఫిక్షన్ జత చేశారు. భవిష్యత్తు చూపించే యంత్రం అంటూ ఈ సినిమా స్టోరీపై ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేశారు. స్టోరీ బాగానే ఉన్నా.. కానీ కథనంలో కాస్తంత సాగదీత ప్రేక్షకులకు అక్కడక్కడా సహనానికి పరీక్ష పెడుతోంది. సైన్స్ ఫిక్షన్ కథలో హీరో, హీరోయిన్ మధ్య ప్రేమ పంటికింద రాయిలా అనిపిస్తోంది. ఇంటర్వెల్‌లో ముగ్గురు ఫ్రెండ్స్ ని ఎవరో చంపబోతున్నట్టు ట్విస్ట్ తో సెకండ్‌ హాఫ్ పైఇంట్రెస్ట్ క్రియేట్ చేసారు. ఇక సెకండ్ హాఫ్ లో అసలు ఏం జరుగుతుంది అని ఒక్కొక్క ట్విస్ట్ రివీల్ చేసుకుంటూ వెళ్లారు. సినిమాలో లివింగ్ స్టోన్ క్యారెక్టర్ తో మాత్రం అక్కడక్కడా నవ్వించారు. తక్కువ క్యారెక్టర్స్ తో ఆల్మోస్ట్ సింగిల్ లొకేషన్ లో కథని ఇంట్రెస్ట్‌గా నడిపించారు. కొన్ని సీన్స్ లో భయపెట్టారు కూడా. సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ ఇంకొంచెం బెటర్ తీసుంటే ఇంకా మంచిగా ఉండేది. సింగిల్ లొకేషన్ లో ఆల్మోస్ట్ కథని బాగానే నడిపించారు. పాటలు మాత్రం మెలోడీగా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ భయపెట్టింది. దర్శకుడిగా ప్రదీప్ అల్లు మొదటి సినిమాలో పర్వాలేదనిపించారు. చిన్న సినిమా కావడంతో ఉన్న లిమిటెడ్ బడ్జెట్ లో మంచి అవుట్ పుట్ ఇచ్చారు. మొత్తంగా 'దర్శిని' సినిమా జరగబోయే భవిష్యత్తు చూపించే మిషన్, దాని కోసం కొంతమంది ఏం చేసారు అని ఆసక్తిగా తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా

నటీనటుల విషయానికొస్తే..
సినిమాలో అందరూ కొత్తవాళ్లే నటించారు. వికాస్, శాంతి ప్రియ జంటగా మెప్పించారు. లివింగ్ స్టోన్ మాత్రం ఫుల్ కామెడీతో నవ్వించాడు. మిగిలిన పాత్రలు తమ పాత్ర పరిధి మేరకు నటించారు.

ప్లస్ పాయింట్స్

స్టోరీ లైన్

ఫస్ట్ హాఫ్

క్లైమాక్స్ సీన్స్

మైనస్ పాయింట్స్

కొత్త నటీనటులు

రొటీన్ సీన్స్

ఎడిటింగ్

రేటింగ్: 2.75/5

దర్శిని.. ఆకట్టుకునే సైన్స్ ఫిక్షన్ హార్రర్ థ్రిల్లర్

ఇదీ చదవండి:  వ్యాపారం చేయడానికి రూ. 5000 వేలు కూడా లేనివ్యక్తి.. నేడు రూ. 16,900 కోట్లకు అధిపతి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News