ఎన్ఆర్ఐ చట్టాలు మరింత కఠినతరం

ఎన్‌ఆర్‌ఐ వివాహాల చట్టాలను భారత్ మరింత కఠినతరం చేసింది.

Last Updated : Jun 7, 2018, 10:59 AM IST
ఎన్ఆర్ఐ చట్టాలు మరింత కఠినతరం

ఎన్‌ఆర్‌ఐ వివాహాల చట్టాలను భారత్ మరింత కఠినతరం చేసింది. ఎన్‌ఆర్‌ఐలు వివాహం చేసుకుంటే, తప్పనిసరిగా వివాహం జరిగిన 48 గంటల్లోనే దగ్గరలోని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదు చేసుకోవాలని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ తెలిపారు. భారతదేశంలో జరిగే ఎన్‌ఆర్‌ఐ వివాహాలకు ఈ నియమం వర్తిస్తుందన్నారు. ఒకవేళ పెళ్ళైన జంట ఎవరైనా రిజిస్టర్ చేసుకోకపోతే వాళ్ల పాస్‌పోర్ట్, వీసా జారీలను వెంటనే ఆపేస్తామని భారత ప్రభుత్వం హెచ్చరించింది.

ఎన్‌ఆర్‌ఐలు వివాహం చేసుకుని, భార్యలను ఇండియాలోనే వదిలేసి వెళ్తున్న సంఘటనలు ఎక్కువవుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు కొత్త నిబంధన తీసుకురానుంది. ఇటీవల పలు సందర్భాల్లో ప్రభుత్వం ఎన్‌ఆర్‌ఐల కోసం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఎన్ఆర్ఐల మోసాలను అడ్డుకోనేలా తీసుకురానున్న ఈ నిబంధనపై త్వరలో దేశంలోని అన్ని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలకు  సమాచారం పంపించనుంది.

Trending News