Smell From Soil: వర్షం పడగానే మట్టి నుంచి ఒకరకమైన మంచివాసన వస్తుంది.. దీని వెనుక కారణం ఏంటో తెలుసా..?

Smell From Soil:  సాధారణంగా వర్షం పడిన తర్వాత మట్టి లోపల నుంచి ఒక రకమైన మంచి వాసన వస్తుంది.దీన్ని ఎంజాయ్ చేయడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా పల్లెటూర్లలో ఉండేవారికి ఈ అనుభవం ఎక్కువగా ఉంటుంది. తొలకరి సమయంలో వర్షం పడటం వల్ల భూమి నుంచి ఒకరకమైన సువాసన వస్తుంది.
 

1 /6

కొన్నిరోజులుగా భానుడు భగ భగమండిపోతున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా సూర్యుడు ఉదయంపూటే చుక్కలలు చూపిస్తున్నాడు. జనాలు బైటకు వెళ్లలంటేనే జంకుతున్నారు. ఈ క్రమంలో వాతావరణం ఒక్కసారిగా కొన్ని ప్రాంతాలలో చల్లబడింది. ముఖ్యంగా తెలంగాణాలో మూడు రోజుల పాటు వర్షం పడుతుందని ఐఎండీ తెలిపింది.  

2 /6

మనలో చాలా మందికి వర్షం అంటే ఎంతో ఇష్టం. వర్షంలో గడపటానికి తెగ ఆసక్తి చూపిస్తుంటారు. వర్షపుచినుకులు పడుతుంటే చాలు ఇంట్లో నుంచి బైటకు పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంటారు. వర్షంలో తడుస్తు వేడి నుంచి ఉపశమనం పొందుతారు. పల్లె, పట్టణం అని తేడాలేకుండా కొంత మంది యువత వర్షంలో అందరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు.   

3 /6

వర్షం పడగానే మట్టిలోపలి నుంచి ఒకరకమైన వాసన వస్తుంది. దీన్ని చాలా మంది ఇష్టపడతారు. వర్షపు చినుకులు నేలపై పడినప్పుడు ఈ వాసన అత్య‌ధికంగా వ‌స్తుంది. పొలాలల్లో.. చదును చేయని నేలపై వర్షపు చినుకులు పడినప్పుడు, అది చిన్న గాలి బుడగలుగా మారుతుంది.

4 /6

ఈ బుడగలు పగిలిపోయే ముందు పైకి కదులుతాయి. అప్పుడు గాలిలోని అతి చిన్న కణాలను బయటకు పంపుతాయి.  వీటిని ‘ఏరోసోల్స్‘ అంటారు. ఈ ఏరోసాల్స్, వర్షపునీరు కలిసి పోయి భూమి మీద పడటం వల్ల ఈ విధమైన స్మెల్ వస్తుందని చెబుతుంటారు. 

5 /6

భూమిలోపల కొన్ని బ్యాక్టిరియాలు ఉంటాయి. ఇవి వర్షంపడుతుందనగానే బైటకు వస్తాయంట. అవి కొన్నిరసాయనాలను విడుదల  చేస్తాయంట. ఆ రసాయనాలతో వర్షం జరిపే చర్యలు వల్ల భూమి నుంచి ఒక ప్రత్యేకమైన ఘాటైన సువాసన వస్తుందని కొందరు నిపుణులు చెబుతుంటారు. 

6 /6

కొన్ని పరిశోధలన ప్రకారం..గాలిలో ఉండే కణాలు, భూమిపైన ఉన్న కణాలతో చర్యలు జరుపుతాయి. వీటితో.. బాక్టిరియాలు కలసి పోయి ప్రత్యేకమైన వాసన వచ్చేలా చేస్తాయి. ఈ క్రమంలో భూమి నుంచి ఒకరకమైన సువాసన వస్తుందని కూడా చెబుతుంటారు. భూమి నుంచి ఈనూనెలు తిరిగి గాలిలోకి విడుదల కావడం వల్ల మంచి సువాసన వస్తుందని చెబుతుంటారు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)