Jr NTR Top Movies: RRR స‌హా జూనియ‌ర్ ఎన్టీఆర్ కెరీర్‌ను ఛేంజ్ చేసిన‌ టాప్ మూవీస్ ఇవే..

Jr NTR Top Movies: నందమూరి తారకరామారావు అలియాస్ జూనియర్  ఎన్టీఆర్.. పెద్ద ఎన్టీఆర్ నట వారసుడిగా సినీ రంగంలో ప్రవేశించి నటుడిగా తాతకు తగ్గ మనవడిగా పేరు తెచ్చుకున్నాడు. హీరోగా 20 యేళ్లకు పైగా కెరీర్‌లో టాప్ చిత్రాల విషయానికొస్తే..

1 /13

RRR (ఆర్ఆర్ఆర్) రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) మూవీ భారతీయ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్‌గా ఎదిగాడు.

2 /13

అరవింద సమేత వీరరాఘవ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్, పూజా హెగ్డే టైటిల్ రోల్ పోషించిన చిత్రం 'అరవింద సమేత వీరరాఘవ'. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

3 /13

జై లవకుశ ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయంలో బాబీ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

4 /13

జనతా గ్యారేజ్ కొరటాల శివ దర్శకత్వంలో మోహన్‌లాల్ మరో ముఖ్యపాత్రలో నటించిన చిత్రం 'జనతా గ్యారేజ్'. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

5 /13

నాన్నకు ప్రేమతో సుకుమార్ దర్శకత్వంలో సున్నితమైన తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం 'నాన్నకు ప్రేమతో'. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్‌గా నిలిచింది.

6 /13

టెంపర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమా టెంపర్. తారక్ నెగిటివ్ షేడ్స్ క్యారెక్టర్‌లో నటించిన ఈ సినిమా తారక్ కెరీర్‌లో డిఫరెంట్ మూవీగా నిలిచిపోయింది. అప్పటి నుంచి అపజయం ఎరగకుండా దూసుకుపోతున్నాడు.

7 /13

బృందావనం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన మూవీ 'బృందావనం'. ఈ సినిమాలో తారక్ సరసన కాజల్ అగర్వాల్, సమంత కథానాయికలుగా నటించారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది.

8 /13

అదుర్స్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ పూర్తి స్థాయిలో ద్విపాత్రాభియం చేసిన సినిమా 'అదుర్స్'. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.  

9 /13

యమదొంగ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్.. హీరోగా నటించిన సోషియో ఫాంటసీ మూవీ 'యమదొంగ'. మోహన్ బాబు యమధర్మరాజుగా నటించిన ఈ మూవీ తారక్ కెరీర్‌లో మరో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

10 /13

సింహాద్రి రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'సింహాద్రి'. ఈ సినిమాతో ఎన్టీఆర్ స్టార్ హీరోగా స్థిరపడ్డాడు. తిరుగులేని మాస్ ఇమేజ్‌ ఈ సినిమాతో దక్కించుకున్నాడు.

11 /13

ఆది వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆది' మూవీ ఎన్టీఆర్ కెరీర్‌లో డిఫరెంట్ మూవీగా నిలిచిపోయింది. తొలిసారి మాస్ హీరోగా తారక్‌ను ఎస్టాబ్లిష్ చేసిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది.

12 /13

స్టూడెంట్ నెం. 1 రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'స్టూడెంట్ నెం. 1. ఈ సినిమాతో తొలిసారి ఎన్టీఆర్ హీరోగా సక్సెస్ అందుకున్నాడు. దర్శకుడిగా రాజమౌళికి ఇదే ఫస్ట్ మూవీ కావడం విశేషం.

13 /13

రామాయణం జూనియర్ ఎన్టీఆర్ బాల రాముడిగా నటించిన  సినిమా 'రామాయణం'. యం.యస్.రెడ్డి నిర్మాతగా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది.