Kia Ev3 Price: ప్రీమియం ఫీచర్స్‌తో కియా EV3 వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ లీక్!

Kia Ev3 Price: త్వరలోనే ప్రముఖ కియా కంపెనీ మార్కెట్‌లోకి కొత్త కారును లాంచ్‌ చేయబోతోంది. ఇది EV వేరియంట్‌లో రాబోతోంది. అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.     

 

Kia Ev3 Price: త్వరలోనే మంచి ఎలక్ట్రిక్‌ కారును కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇంకా కొన్ని రోజుల పాటు వెయిట్‌ చేయాల్సి ఉంటుంది. త్వరలోనే ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి కొత్త కియా EV కారు లాంచ్‌ కాబోతోంది. ఇది శక్తివంతమైన ఇంజన్‌తో అందుబాటులోకి రాబోతోంది. అయితే ఈ కారుకు సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇప్పుడు తెలుసుకుందాం.

1 /5

దక్షిణ కొరియా ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ కియా మే 23న తన కొత్త ఎలక్ట్రిక్ కారు EV3ని మార్కెట్‌లోకి విడుదల చేయబోతోంది. లాంచింగ్‌కి ముందే కారుకు సంబంధించిన  టీజర్‌ను కంపెనీ విడుదల చేసింది.

2 /5

  కియా EV3 కారుకు సంబంధించిన సమాచారాన్ని కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఇటీవలే లీక్‌ అయిన వివరాల ప్రకారం, కియా ఈవీ3కి బాక్సీ డిజైన్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ప్రీమియం లుక్‌లో కనిపించబోతోంది.

3 /5

ఈ కియా EV3 కారు స్టైలిష్ సిగ్నేచర్ LED లైటింగ్, బ్లాక్ క్లాడింగ్ సెటప్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ఈ కారు చూడడానికి అచ్చం స్టోర్ట్‌ లుక్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

4 /5

ఈ కారును కియా అధునాతన ఫీచర్లతో పాటు ఆధునిక సాంకేతికతతో మార్కెట్‌లోకి విడుదల కాబోతోంది.  ఇక ఈ కారు ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే ఇది స్టైలిష్ స్టీరింగ్ వీల్‌తో రాబోతోంది. దీంతో పాటు ప్రీమియం అప్హోల్స్టరీని కలిగి ఉంటుంది.

5 /5

ఇక Kia EV3 ధర వివరాల్లోకి వెళితే, మార్కెట్‌లోకి లాంచ్‌ అయితే, ధర రూ. 29.2 లక్షలతో అందుబాటులోకి రాబోతోంది. ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ త్వరలోనే అధికారికంగా లాంచ్‌ చేసే ఛాన్స్‌ ఉంది.