Mehreen Kaur: చిరిగిన ప్యాంట్‌తో నడుమందాలు చూపిస్తూ కవ్విస్తోన్న మెహ్రీన్ కౌర్..

Mehreen Kaur: మెహ్రీన్ కౌర్ విషయానికొస్తే.. ఎంతో అందం, నటన ఉన్న ఈ భామకు సక్సెస్‌లున్నా కథానాయికగా పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. చాలా మంది కథానాయికలకు సక్సెస్ కోసం ఎదురు చూస్తుంటే..ఈమెకు మాత్రం విజయాలున్నా అందుకు తగ్గ ఛాన్సులు మాత్రం రావడం లేదనే చెప్పాలి.

1 /5

మెహ్రీన్ కౌర్ మోడలింగ్ ఫీల్డ్ నుంచి సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తెలుగులో నాని హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'కృష్ణగాడి వీరప్రేమగాథ' సినిమాతో వెండితెరకు పరిచయమైంది.

2 /5

ఫస్ట్ మూవీతోనే మంచి విజయం అందుకున్న కథానాయికల్లో మెహ్రీన్ కౌర్ ఒకరు. ఆ తర్వాత ఈమెకు వరుస అవకాశాలు రావడం మొదలయ్యాయి.

3 /5

అనిల్ రావిపూడి దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన 'రాజా ది గ్రేట్' మూవీతో వరుసగా రెండో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకుంది.

4 /5

ఆ తర్వాత వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన 'F2' మూవీలో హనీ ఈజ్ ది బెస్ట్ అంటూ మెహ్రీన్ చేసిన అల్లరిని ప్రేక్షకులు మరిచిపోలేదు. అప్పట్లో హర్యాణ మాజీ సీఎం మనవడితో ఎంగేజ్మెంట్ చేసుకొని వార్తల్లో నిలిచింది. ఆ తర్వాత అది పెళ్లి వరకు వెళ్లకుండానే ఆగిపోయింది.

5 /5

ఇక ఎఫ్ 2 మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన 'ఎఫ్ 3' మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించినా.. ఈ అమ్మడికి మాత్రం పెద్దగా ఒరిగిందేమి లేదు. అందుకే సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తోంది.