Mouth Ulser Home remedies: మౌత్ అల్సర్ తో బాధపడుతున్నారా..? ఈ సింపుల్ హోమ్ రెమిడీ పాటిస్తే ఇట్టే ఉపశమనం..

Mouth Ulcers: మనలో చాలా మంది నోటిలో పుండ్లతో తెగ బాధపడుతుంటారు. కనీసం మాట్లాడలేక తీవ్ర ఇబ్బందులు పడుతారు. కొందరికి ఎండకాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది.
 

1 /6

కొందరు ప్రతిదానికి ఎంతో టెన్షన్ పడుతుంటారు. వీరు ప్రాపర్ గా ఫుడ్ కూడా తీసుకొరు. అందుకే ఇలాంటి వారిలో ఎక్కువగా  మౌత్ అల్సర్ సమస్య కన్పిస్తుంది. నోరంతా తెల్లగా పూత వచ్చినట్లు వెచ్చి ఉంటుంది.  

2 /6

నోటి పూత వల్ల సరిగ్గా మాట్లాడటానికి కూడా ఇబ్బందులు పడతారు. కొందరిలో విటమిన్స్ లోపం వల్ల ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. నోటి పూత వచ్చే ముందు వీరి శరీరంలో అనేక మార్పులుసంభవిస్తాయి.

3 /6

కొందరిలో మూత్రం పసుపుపచ్చగా రావడం జరుగుతుంది. ఆ తర్వాత శరీరంలో తీవ్రమైన ఒక అనీజీ గా అన్పిస్తుంది. దీంతో ఏపనికూడా చేయాలన్నిపించక చికాకుగా ఉంటారు. ప్రతి దానికి కోపం తెచ్చుకుంటారు.  

4 /6

మౌత్ అల్సర్ వస్తే.. మొదట నెయ్యిని, తేనెను మిక్స్ చేసుకొవాలి. ఈ రెండింటిని చక్కగా మిక్స్ చేసి నోటి పూత ఏర్పడిన భాగానికి పెట్టాలి. అంతేకాకుండా.. వేడి పదార్థాలను తినడం మానేయాలి.

5 /6

ఇంట్లో తులసీ నీళ్లను రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు తాగుతుండాలి. అంతేకాకుండా..రాత్రి పూట తాగే నీటిలో తులసీఆకులను వేసుకొవాలి. తెల్లవారు జామున తాగితే మంచి ఫలితం ఉంటుంది.

6 /6

పసుపు నీళ్లను కూడా తాగిన మంచి రిజల్ట్ ఉంటుంది. నోటిలో పూత వచ్చిన ప్రదేశంలో పాలమీగడను కూడా అద్దితే మంచి రిజల్ట్ ఉంటుంది. అలోవెరాను తీసి, దాని పెస్టును అల్సర్ ఉన్న చోట పెడితే కొద్దిసేపట్లోనే మంచి ఉపశమనం ఉంటుంది.Disclaimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నవి వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)