Shriya: కూతురుతో శ్రియా క్యూట్ స్టిల్స్.. చూస్తే మతిపోవాల్సిందే

Shriya and Her Daughter: 
గత కొద్ది రోజులగా తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న శ్రియ.. ఇంస్టాగ్రామ్ లో మాత్రం తరచూ తన ఫోటోలతో అభిమానులను అలరిస్తూఉంటుంది.

1 /5

ఇష్టం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ శ్రియ. ఆ తర్వాత వచ్చిన సంతోషం సినిమాతో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది.

2 /5

ఇక అప్పటినుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు ఈ హీరోయిన్. స్టార్ హీరో సినిమా దగ్గర నుంచి చిన్న హీరో సినిమా వరకు దాదాపు అందరూ సినిమాలలో కనిపించి మెప్పించింది.  

3 /5

తెలుగు తో పాటు ఎన్నో ఇండస్ట్రీలలో తన నటనను రుజువు చేసుకొని మంచి పేరు తెచ్చుకుంది. అయితే తమిళ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తరువాత కొద్దిగా తెలుగు సినిమాలు తగ్గించింది శ్రియ.

4 /5

ఇక పెళ్లి చేసుకొని ఒక కూతురికి జన్మనిచ్చిన తరువాత సినిమాలను మరింత తగ్గించింది. అయితే తన ఇంస్టాగ్రామ్ ఫోటోల ద్వారా మాత్రం ఎల్లప్పుడూ తన అభిమానులను అలరిస్తూఉంటుంది.

5 /5

ఈ క్రమంలో శ్రియా తన కూతురు రాధా తో కలిసి షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతూ అందరిని తెగ ఆకట్టుకుంటున్నాయి.