Vitamin B12: విటమిన్ బి12 లోపం కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలు.. ఈ లోపం ఎలా వస్తోంది?


Vitamin B12 Deficiency In Telugu: చాలామందిలో విటమిన్ బి 12 లోపం కారణంగా అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే ఈ సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు ఏంటో? విటమిన్ బి 12 రాకుండా తీసుకోవాల్సిన ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


Vitamin B12 Deficiency In Telugu: మనం ఆరోగ్యంగా ఉండడానికి ప్రతిరోజు యాక్టివ్ గా పని చేసేందుకు విటమిన్లు కీలక పాత్ర పోషిస్తాయి అయితే ప్రస్తుతం చాలామందిలో విటమిన్ లోపం సమస్యలు వస్తున్నాయి. దీనికి కారణంగా అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా విటమిన్ బి 12 లోపంతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ విటమిన్ బి 12 శరీరానికి తగిన శక్తిని అందించేందుకు, కేంద్ర నాడీ వ్యవస్థ ప్రక్రియకు కీలక పాత్ర పోషిస్తుంది.

1 /5

ముఖ్యంగా ఈ విటమిన్ 12 లోపం వయస్సు పెరిగిన వారిలో ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ లోపం కారణంగా చాలామంది ప్రాణాంతక వ్యాధుల బారిన కూడా పడుతున్నారని సీనియర్ వైద్య నిపుణులు చెబుతున్నారు. తరచుగా అనారోగ్య సమస్యల బారిన పడడానికి ఇది కూడా ఒక కారణమేనని వారంటున్నారు.

2 /5

శరీరంలో తగిన మోతాదులో పోషకాలు లేకపోవడం కారణంగా చాలామందిలో విటమిన్ బి12 లోపం వంటి సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా చిన్న వయసులోనే ఈ సమస్యల బారిన పడుతున్నారు. కాబట్టి ఇలాంటి ఈ లోపం బారిన పడకుండా ఉండడానికి ప్రతిరోజు తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాలి.  

3 /5

ముఖ్యంగా ఈ విటమిన్ బి 12 లోపం రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. శాకాహారాలు తీసుకునే చాలామందిలో ఈ లోపం ఏర్పడుతోంది. దీంతోపాటు 60 ఏళ్లు నిండిన వారిలో కూడా ఈ లోపం వస్తోంది. అలాగే బరువు తగ్గడానికి చేయించుకున్న చికిత్స కారణంగా కూడా కొంతమందిలో ఈ లోపం వస్తోంది.   

4 /5

శరీరంలో తగిన మోతాదులో విటమిన్ b12 లేకపోవడం కారణంగా అనేక అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా చాలామందిలో బద్ధకం, అలసట మానసిక వ్యాధులు,  నరాల సంబంధిత సమస్యలు వస్తున్నాయి.  

5 /5

ఈ విటమిన్ B12 లోపంతో బాధపడుతున్న వారు తప్పకుండా ప్రతిరోజు పాలతో తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు మాంసం, గుడ్లు, చేపలు తగిన మోతాదులో తీసుకోవడం వల్ల ఈ లోపం నుంచి ఉపశమనం పొందవచ్చు.