Aadi Sai Kumar Top Gear : టాప్ గేర్ స్పీడులో ఆది.. సందీప్ కిషన్ కాంబోలో సినిమా

Aadi Sai Kumar Sundeep Kishan Movie ఆది సాయి కుమార్ టాప్ గేర్ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ఈవెంట్ నిన్న జరిగింది. ఈ ఈవెంట్‌లో హీరో సందీప్ కిషన్ సందడి చేశాడు. ఇద్దరూ కలిసి సినిమా చేయబోతోన్నట్టు ప్రకటించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 28, 2022, 05:00 PM IST
  • టాప్ గేర్ ప్రీ రిలీజ్ ఈవెంట్
  • హీరో సందీప్ కిషన్ సందడి
  • ఆదితో సందీప్ కిషన్ చిత్రం
Aadi Sai Kumar Top Gear : టాప్ గేర్ స్పీడులో ఆది.. సందీప్ కిషన్ కాంబోలో సినిమా

Aadi Sai Kumar Top Gear : ఆది సాయి కుమార్ హీరోగా రాబోతోన్న టాప్ గేర్ సినిమా డిసెంబర్ 30న రిలీజ్ కానుంది. ఈ చిత్రం రియా సుమన్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని కె. శశికాంత్ దర్శకత్వంలో  K. V. శ్రీధర్ రెడ్డి  నిర్మిస్తున్నాడు ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఈ చిత్రం రూపొందుతోంది.  డిసెంబర్ 30న రిలీజ్ అవుతుండటంతో చిత్ర  యూనిట్ ప్రి రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్ గా జరుపుకుంది.  

సాయికుమార్ మాట్లాడుతూ.. ఆదిని ఒక క్రికెటర్ అవ్వాలని అనుకొన్నాం, కానీ మెగాస్టార్  అన్నయ్య సాంగ్ తో ఇండస్ట్రీ కు వచ్చాడు. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ టాప్ గేర్ సినిమా మా ఆది కి బిగ్ బ్రేక్ అవుతుందని ఆశిస్తున్నానంటూ చెప్పుకొచ్చాడు. సందీప్ కిషన్ మాట్లాడుతూ.. డైరెక్టర్ శశి  తనకు ఏడేళ్ల నుంచి తెలుసని, అతని దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండటం ఆనందంగా ఉందని అన్నాఉ. ఆది తనకు బెస్ట్ ఫ్రెండ్ అని, ఈ సినిమాతో ఆయన కెరీర్ బ్రేకుల్లేకుండా సాగిపోవాలని కోరుకున్నాడు. 2023లో ఆదితో తాను ఒక సినిమా చేస్తున్నామంటూ చెప్పుకొచ్చాడు.

నిర్మాత శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ దర్శకుడు  శశి చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేశానని, ఆది, రియాలు ఇద్దరూ చాలా బాగా నటించారని అన్నాడు. ఆది సాయికుమార్ మాట్లాడుతూ.. నిర్మాత శ్రీధర్ చాలా పాజిటివిటి ఉన్న వ్యక్తి అని, సినిమాను ఇంకా బాగా తీసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్ళాలి అనుకునే వ్వక్తి అని అన్నాడు.  

చిత్ర దర్శకుడు శశికాంత్ మాట్లాడుతూ.. థ్రిల్లర్, సస్పెన్స్ ఇలా అన్ని ఎమోషన్స్ ఉన్న ఇలాంటి మంచి కథ అని తెలిపాడు. ఇలాంటి సినిమాకు మంచి ప్యాషన్ ఉన్న నిర్మాత శ్రీధర్ రెడ్డి గారు లభించడమే  అదృష్టంగా భావిస్తున్నానని అన్నాడు. ఇలాంటి మంచి సినిమాలో బ్యూటిఫుల్ క్యారెక్టర్  చేసే అవకాశం ఇచ్చిన దర్శక,నిర్మాతలకు  థాంక్స్ అని రియా సుమన్ తెలిపింది.

Also Read : Rashmika Mandanna : అందులో సౌత్ ఇండస్ట్రీ కంటే బాలీవుడ్ బెటర్!.. రష్మిక వ్యాఖ్యలు.. నెటిజన్ల కౌంటర్లు

Also Read : Ananya Panday pics : ప్యాంట్ మరిచిపోయిన బ్యూటీ.. అనన్య పాండే అందాల ప్రదర్శన.. పిక్స్ వైరల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News