Bear vs Tiger: అట్లుంటదీ మరీ.. పెద్దపులికి చుక్కలు చూపించిన ఎలుగుబంటి.. వైరల్ గా మారిన వీడియో..

Bear vs Tiger:పెద్ద పులి దూరంగా ఉన్న ఎలుగుబంటిని చూసింది. మెల్లగా వెళ్లి దాడిచేయడానికి ప్రయత్నించింది. కానీ ఇంతలో ఎలుగు బంటి ఏమాత్రం భయపడకుండా రివర్స్ లో అటాక్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.  

Last Updated : Apr 27, 2024, 09:24 AM IST
  • పెద్దపులికి పై దాడికి దిగిన ఎలుగు బంటి..
  • సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచిన వీడియో..
Bear vs Tiger: అట్లుంటదీ మరీ.. పెద్దపులికి చుక్కలు చూపించిన ఎలుగుబంటి.. వైరల్ గా మారిన వీడియో..

Battle Between Bear And Tiger video Goes Viral: సోషల్ మీడియాలో ప్రతిరోజు బోలేడు వీడియోలు వైరల్ గా మారుతుంటాయి. వీటిలో వైరల్ కంటెంట్ లు, జంతువులకు చెందిన కంటెంట్ లు, పెళ్లిలో వెరైటీ ఫన్నీ సంఘటనలకు చెందిన వీడియో వైరల్ అవుతుంటాయి. అదే విధంగా పాముల వీడియోలు కూడా ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. జంతువులకు ఫైటింగ్ చేసుకున్న వీడియోలు కూడా తరచుగా వార్తల్లో ఉంటాయి. సాధారణంగా అడవిలో క్రూర జంతువులు, ఇతర జంతువులపై దాడులు చేసి వేటాడుతుంటాయి. కానీ కొన్ని సందర్భాలలో.. క్రూర జంతువులు కూడా వాటికన్నచిన్న జంతువుల చేతిలో భయపడిపోతుంటాయి. పిల్లిని గదిలో వేసి దాడిచేస్తే అది దాడి చేస్తుందంటారు. అదే విధంగా.. కొన్నిసార్లు అడవి దున్నలు..సింహాలపై దాడులు చేస్తుంటాయి.

 

తమ జోలికికానీ, తమ పిల్లల జోలికి వస్తే సాధుజంతువులు కూడా యూనీటీగా ఏర్పడి, దాడులు చేస్తుంటాయి. ఇలాంటి వీడియోలు గతంలో మనం అనేకం చూశాం. తాజాగా, మరో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. ఇక్కడ ఒక ఎలుగు బంటి, పెద్దపులిపై దాడిచేసింది.  కొన్నిసార్లు అడవిలో ఉన్న ఆకారంలో కానీ, శక్తిలో చిన్నవిగా ఉండే జంతులు రివర్స్ అటాక్ చేస్తుంటాయి. ముఖ్యంగా అవి గుంపులుగా ఉన్నప్పుడు, క్రూర జంతువులు దాడిచేస్తే మాత్రం సీన్ మరోలా ఉంటుంది. అందుకు సింహాలు, కానీ క్రూర జంతువులు కానీ దాడులు చేసేటప్పుడు ఒక ప్రత్యేకమైన స్ట్రాటజీనీ ఫాలో అవుతుంయి. ముందుగా గుంపులను వేరు చేస్తాయి. ఆ తర్వాత చివరగా మిగిలిపోయిన వాటిలో బలహీనమైన వాటిని చూసి మూకుమ్మడిగా దాడులు చేస్తుంటాయి. 

అడవిలో సింహాన్ని రాజుగా చెబుతుంటారు. సింహాం తర్వాత పెద్దపులి, చిరుతపులులు కూడా తరచుగా ఇతర జంతువులపై దాడులు చేస్తుంటాయి. కానీ కొన్నిసార్లు ఈ క్రూర జంతువులపై కూడా,ఇతర జంతువులు దాడులు చేస్తుంటాయి. సింహాల గుంపులు, పులలను పరిగెత్తించిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. ఒక పెద్ద పులి దూరం నుంచి ఎలుగు బంటిని చూసింది. వెంటనే దాని దగ్గరకు చేరుకుని, దాడిచేయడానికి ప్రయత్నించింది. దీంతో ఎలుగు బంటి కూడా అంతే రేంజ్ లో ప్రతిఘటించింది.

Read more: Pune man Quits Job: ఇలాంటి టాక్సిక్ మనుషుల మధ్య పనిచేయలేను.. వైరల్ గా మారిన పూణే యువకుడి లాస్ట్ వర్కింగ్ డే సెలబ్రేషన్స్..

ఏమాత్రం భయపడకుండా.. ఎలుగుబంటి రెండు కాళ్ల మీద నిలబడి, పదునైన తనచేతి గోర్లు, పండ్లుచూపిస్తు బలంగా ప్రతిఘటించింది. ఎలుగు బంటి పదే పదే దాడిచేయడం చూసిన, పెద్దపులి ఒక అడుగు వెనక్కు వేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వార్తలలో నిలిచింది. దీన్ని చూసిన నెటిజన్లు వామ్మో.. ఎలుగు బంటి డేర్ మాములుగా లేదుగా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎలుగు బంటి భలే ధైర్యం చూపిందంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News