Bottole Thrash: 'బాటిల్‌' కోసం చెప్పుతో కొట్టిన ప్రముఖ గాయకుడు.. నెట్టింట్లో తీవ్ర దుమారం

Fateh Ali Khan: ఓ బాటిల్‌ విషయమై ప్రముఖ సింగర్‌ తన సహాయకుడిపై దాడికి పాల్పడ్డాడు. చెప్పుతో అతడిపై దాడికి పాల్పడడంతో తీవ్ర దుమారం రేపుతోంది. అతడి తీరుపై తోటి గాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడడంపై సదరు గాయకుడు క్షమాపణలు చెప్పిన కూడా నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jan 28, 2024, 05:49 PM IST
Bottole Thrash: 'బాటిల్‌' కోసం చెప్పుతో కొట్టిన ప్రముఖ గాయకుడు.. నెట్టింట్లో తీవ్ర దుమారం

Viral Video: 'పవిత్ర జలం' ఉన్న సీసా (బాటిల్‌) కనిపించకుండా పోవడంతో పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ గాయకుడు రాహత్‌ ఫతే అలీఖాన్‌ చిర్రెత్తుకొచ్చింది. బాటిల్‌ కనిపడకపోవడానికి కారణం తన సహాయకుడే అని భావించి అతడిపై తీవ్రంగా దాడికి పాల్పడ్డాడు. దుర్భాషలాడుతూ అతడిని చెప్పుతో.. చేతితో కొట్టాడు. కింద కూర్చొబెట్టి 'నా బాటిల్‌ ఎక్కడ' అంటూ దాడి చేశాడు. ఇదంతా వీడియోలో రికార్డయ్యింది. ఈ వీడియో బయటకు రావడంతో అందరూ గాయకుడు అలీఖాన్‌పై మండిపడుతున్నారు. బాటిల్‌ కనిపించకపోతే ఇంతలా దాడికి పాల్పడుతారా అని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన మన గాయని, ప్రముఖ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ శ్రీపాద చిన్మయి స్పందించింది. గాయకుడు ఫతే అలీఖాన్‌ తీరుపై చిన్మయి మండిపడింది. అతడి చర్యను ఖండించింది.

క్షమాపణ
వీడియో వైరల్‌ కావడంతో ఫతేఖాన్‌ ఓ వీడియో ద్వారా స్పందించారు. 'ఇది గురుశిష్యుల మధ్య జరిగిన విషయం. శిష్యుడు తప్పు చేస్తే గురువు దండించినట్లుగా దీని చూడాలి. బాధితుడు శిష్యుడే అయినప్పటికీ అలా కొట్టడం తప్పే. దీనికి నేను క్షమాపణలు చెబుతున్నా' అని ఫతేఖాన్‌ క్షమాపణలు చెప్పారు. ఇదే వీడియోలో బాధితుడు కూడా మాట్లాడాడు. 'అలీఖాన్‌ నాకు తండ్రిలాంటి వారు. నన్ను ప్రేమగా చూసుకుంటారు. కోపంలో ఆయన నన్ను కొట్టాడు అంతే. దీనిలో అంతకుమించి ఎలాంటి దురుద్దేశం లేదు' అని అతడు తెలిపాడు. వివరణతో ఇక్కడితో వివాదం ముగిసిపోయింది.

ఫతేఖాన్‌ ఎవరు?
పాకిస్థాన్‌ ప్రముఖ గాయకుల్లో ఫతేఖాన్‌ ఒకరు. అద్భుతమైన పాటలు పాడి పాక్‌ ప్రజలను అలరిస్తున్నారు. ఆయన పాడిన పాటలు అనేక సినిమాల్లో సూపర్‌హిట్‌గా నిలిచాయి. అతడి పాటలకు భారతదేశంలోనూ అభిమానులు ఉండడం గమనార్హం. సంప్రదాయ ఖవ్వాలీ గాయకుడు. అతడి కుటుంబమంతా సంగీతకారులే. తాత, తండ్రి అందరూ గాయకులే.

Also Read: AP High Court Junior Civil Judge: ఏపీ పోటీ పరీక్షల్లో తెలంగాణ యువతికి ఫస్ట్‌ ర్యాంక్‌.. అలేఖ్య అరుదైన ఘనత

Also Read: Seethakka: కేటీఆర్‌ పెంపుడు కుక్కల కోసం రూ.12 లక్షలా? మంత్రి సీతక్క విస్మయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News