Gold Buying Tips on Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజు బంగారం కొంటున్నారా ? జాగ్రత్త

Gold Buying Tips on Akshaya Tritiya :అక్షయ తృతీయ.. ఇదో పసిడి పర్వదినం. ఆ రోజు బంగారం కొంటే... మహాలక్ష్మి ఇంటికి వచ్చినట్లేనని చాలా మంది భావిస్తూ ఉంటారు. అందుకే ఆ రోజు బంగారం దుకాణాలన్నీ కస్టమర్లతో కిటకిటలాడుతూ ఉంటాయి. అయితే బంగారం కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Written by - ZH Telugu Desk | Last Updated : May 2, 2022, 05:54 PM IST
  • అక్షయ తృతీయ అంటే బంగారం పండుగ
  • బంగారం కొనుగోలు విషయంలో జాగ్రత్తలు అవసరం
  • ఆఫర్ల పేరిట మోసాలకు అవకాశం
Gold Buying Tips on Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజు బంగారం కొంటున్నారా ? జాగ్రత్త

Gold Buying Tips on Akshaya Tritiya : అక్షయ తృతీయ....   వైశాఖ శుక్ల తదియనాడు వచ్చే ఈ పర్వ దినం అంటే మహిళలకు ఎంతో ఇష్టం. అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే.. మంచిదని చాలా మంది నమ్మకం. వ్యాపారస్తులు ఈ సెంటిమెంట్‌ను మరింతగా ప్రచారం చేయడంతో తప్పని సరిగా ఎంతో కొంత బంగారం కొనాలని చాలా మంది మసస్సులో నాటుకుపోయింది. బంగారం కొనాలని ఎక్కడా లేదంటూ శాస్త్రాలు చెబుతున్నా.. పసిడి కొనుగోలు వైపే మొగ్గు చూపుతుంటారు చాలా మంది. అయితే  కొనుగోలు విషయంలో అప్రమత్తంగా లేకపోతే మొదటికే మోసం తప్పదు.

 బంగారం కొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి.. ?

ఏటా అక్షయ తృతీయ నాడు సగటున 20 నుంచి 25 టన్నుల బంగారం అమ్ముడవుతుందని అంచనా. అయితే జనంలో ఉన్న సెంటిమెంట్‌ను ఆసరాగా తీసుకుని మోసలకు పాల్పడే వారు కోకొల్లలు. అందుకే పసిడి కొనుగోలు విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరమంటున్నారు నిపుణులు.

బంగారం స్వచ్ఛతను క్యారట్లతో కొలుస్తారని తెలుసుకదా. వంద శాతం శుద్ధమైన పసిడిని 24 క్యారట్ల బంగారంగా పిలుస్తారు. అయితే ప్యూర్ గోల్డ్ చాలా మృదువుగా ఉంటుంది కాబట్టి నగలు తయారీ సాధ్యపడదు. అందుకే దాంట్లో రాగి, వెండి, జింక్‌ లాంటి ఇతర లోహాలు కలుపుతారు. సాధారణంగా నగల తయారీకి 10 క్యారెట్ల నుంచి 22 క్యారట్ల స్వచ్ఛత ఉన్న పసిడిని వినియోగిస్తారు. ఉదాహరణకు 22 కేరట్ల బంగారం అన్నారనుకోండి అప్పుడు దాన్ని 24తో భాగించి 100తో గణించాలి.  22 నుంచి 24తో భాగిస్తే 0.9166 వస్తుంది కదా.. దీన్ని 100తో గుణిస్తే 91.66 వస్తుంది. అందుకే సాధారణంగా దీన్ని 916 బంగారు ఆభరణంగా పిలుస్తారు. అయితే 91.66 శాతం బంగారాన్ని 100 నుంచి తీసేస్తే 8.34 శాతం ఇతర లోహాలు వాడారని అర్థం.

అయితే కొందరు వ్యాపారులు 22 క్యారట్ల బంగారం అని చెప్పి 18, 20 క్యారట్ల పసిడిని అంటగడుతూ ఉంటారు. అందుకే హాల్ మార్క్ ఉన్న ఆభరణాలనే కొనాలి. ప్రతి బంగారు ఆభ‌ర‌ణంపై బీఐఎస్ చిహ్నం క‌చ్చితంగా ఉంటుంది. అలా ఉందో లేదో కచ్చితంగా పరిశీలించాలి. హాల్‌మార్క్ సింబ‌ల్ కూడా  బీఐఎస్‌ చిహ్నం వంటిదే. ఈ చిహ్నం ఉన్నా ఆ స్వర్ణాన్ని నాణ్యమైనదని గుర్తించి కొనుగోలు చేయ‌వ‌చ్చు.

ప్రకటనల పట్ల జాగ్రత్త అవసరం :

ఆన్‌లైన్‌లోనూ అనేక కంపెనీలు పసిడి నాణేలు ఆఫర్‌ చేస్తున్నాయి. కాకపోతే ఈ నాణేలు అమ్ముతున్నది నగల వ్యాపారులా? లేక రిఫైనర్లా? అనే విషయం గమనించాలి. బిఐఎస్‌ లేదా హాల్‌మార్క్‌ ఉందో లేదో తెలుసుకోవాలి. దుకాణాలు, లేదా ఆన్‌లైన్‌లో ఆఫర్ల పేరిట ప్రకటనల పట్ల జాగ్రత్తగా ఉండాలి. తరుగు, తయారీకి ఎంత తీసుకుంటున్నారో తెలుసుకోవాలి. నగలు తయారు చేయడానికి కాస్త బంగారం వృథాగా పోతుంది. దానికి వినియోగదారుల నుంచి దుకాణదారులు వసూలు చేస్తారు. కానీ తరుగుకు మరీ ఎక్కువగా ఛార్జ్ చేస్తున్నారో లేదో పరిశీలించడం అవసరం. ఎక్కువని భావిస్తే తగ్గించమని అడగవచ్చు.

Also Read: కేటీఆర్ వర్సెస్ కిషన్‌ రెడ్డి.. బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య ట్వీట్ల యుద్ధం

Also Read: Akshaya Tritiya 2022: అక్షయ తృతీయ రోజు ఏం చేస్తే మంచిది..ఆ సమయంలోనే బంగారం ఎందుకు కొనాలి..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News