IND vs AUS: ఆసీస్‌తో వన్డే సిరీస్​కు కెప్టెన్‌గా రాహుల్.. అక్షర్ ఔట్, అశ్విన్ ఇన్.. ఆ ముగ్గురికి రెస్ట్..

IND vs AUS: మరో నాలుగు రోజుల్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్ ఆరంభం కానుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించింది అజిత్ అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 18, 2023, 10:19 PM IST
IND vs AUS: ఆసీస్‌తో వన్డే సిరీస్​కు కెప్టెన్‌గా రాహుల్.. అక్షర్ ఔట్, అశ్విన్ ఇన్.. ఆ ముగ్గురికి రెస్ట్..

IND vs AUS ODI Series: ఆసియా కప్ గెలిచి మాంచి ఊపుమీదున్న టీమిండియా.. ఇదే జోష్ లో మరో సిరీస్ కు రెడీ అయింది. సెప్టెంబరు 22 నుంచి భారత్‌, ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య మూడు వన్డేల సిరీస్‌ జరగనుంది. ఈ సిరీస్‌ కోసం అజిత్ అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ భారత జట్టును ప్రకటించింది. ఆసియా కప్ ఫైనల్ కు ముందు గాయపడిన  ఆల్‌రౌండర్‌ అక్షర్ పటేల్‌ను తొలి రెండు వన్డేలకు ఎంపిక చేయలేదు. అతడి స్థానంలో సీనియర్ ప్లేయర్ అశ్విన్ ను టీమ్ లోకి తీసుకున్నారు. హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మకు మరోసారి ఛాన్స్ ఇచ్చారు. 

తొలి రెండు వన్డేలకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్‌ పాండ్యకి విశ్రాంతినిచ్చారు. ఆసీస్ తో మెుదటి రెండు మ్యాచులకు కేఎల్ రాహుల్ సారథిగా వ్యవహారించనున్నాడు. మూడో వన్డే నుంచి రోహిత్ కెప్టెన్ గా వ్యవహారిస్తాడు. ఫిట్‌నెస్ పరీక్షలో నెగ్గితే అక్షర్ కూడా మూడో వన్డేక అందుబాటులో ఉండే అవకాశం ఉంది. వన్డే వరల్డ్ కప్ కు ముందు ఈ సిరీస్ ఇరు జట్లకు మంచి ప్రాక్టీస్‌గా ఉపయోగపడనుంది. 

భారత్, ఆస్ట్రేలియా మధ్య సెప్టెంబరు 22న మొహాలీ వేదికగా తొలి వన్డే, సెప్టెంబరు 24న ఇందౌర్‌ వేదికగా రెండో వన్డే, సెప్టెంబరు 27న రాజ్‌కోట్‌ వేదికగా మూడో వన్డే జరగనుంది. ఈ వన్డే సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా, ఆసీస్ మధ్య నవంబరు 23 నుంచి ఐదు టీ20ల సిరీస్‌ మెుదలుకానుంది. 

తొలి రెండు వన్డేలకు భారత జట్టు.. 
కేఎల్ రాహుల్ (కెప్టెన్‌), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్‌ షమి, మహ్మద్‌ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ. 

Also Read: Mohammed Siraj: గొప్ప మనసు చాటుకున్న మ‌హ్మ‌ద్ సిరాజ్.. పైనల్లో వచ్చిన ప్రైజ్ మనీ ఎవరికిచ్చాడంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News