India vs England: ఎంత పనిచేశావ్ భరత్ బ్రో.. అది ఔటే.. బుమ్రా కోపం చూశారా..!

Ind Vs Eng 1st Test Highlights: తొలి టెస్టులో ఇంగ్లాండ్ పుంజుకుంటోంది. మొదటి ఇన్నింగ్స్‌లో తడబడిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్.. రెండో ఇన్నింగ్స్‌లో కుదురుకుంది. ఆలీ పోప్ సూపర్ సెంచరీతో రాణించడంతో ఇంగ్లాండ్ 126 రన్స్ ఆధిక్యంలో ఉంది. నాలుగో రోజు ఆట కీలకంగా మారనుంది.  

Written by - Ashok Krindinti | Last Updated : Jan 27, 2024, 11:56 PM IST
India vs England: ఎంత పనిచేశావ్ భరత్ బ్రో.. అది ఔటే.. బుమ్రా కోపం చూశారా..!

Ind Vs Eng 1st Test Highlights: హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ ఆధిక్యం కనబరుస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థి జట్టును 246 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్.. అనంతరం 436 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో 190 పరుగుల భారీ ఆధిక్యాన్ని సంపాదించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసింది. ప్రస్తుతం 126 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ ఆలీ పోప్ అజేయంగా 148 పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ కోలుకుంది. ఓపెనర్ డక్కెట్ (47), జాక్ క్రాలే (31), బెన్ ఫోక్స్ (34) రాణించారు. ఆలో పోప్‌కు తోడు రెహ్మన్ అహ్మద్ (16 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రా, అశ్విన్ చెరో రెండు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, జడేజా తలో వికెట్ పడగొట్టారు. 

అంతకుముందు ఓవర్‌నైట్‌లో ఏడు వికెట్ల నష్టానికి 421 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా త్వరగానే ఆలౌట్ అయింది. రవీంద్ర జడేజా (180 బంతుల్లో 87), అక్షర్ పటేల్ (44) ఎనిమిదో వికెట్‌కు 78 పరుగుల భాగస్వామ్యాన్ని జోరూట్ విడదీశాడు. 436 పరుగుల వద్ద భారత్ చివరి మూడు వికెట్లను కోల్పోయింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జోరూట్ అత్యధికంగా నాలుగు వికెట్లు తీయగా.. టామ్ హర్ట్లీ, రెహ్మన్ అహ్మద్ చెరో రెండు వికెట్లు తీశారు. జాక్ లీచ్‌కు ఒక వికెట్ దక్కింది. 

ఇక మూడో రోజు ఆటలో కేఎస్ భరత్ ఇచ్చిన సలహాపై బుమ్రా ఆగ్రహం వ్యక్తం చేశాడు. బుమ్రా వేసిన బాల్ ఇంగ్లాండ్ బ్యాటర్ బెన్ డకెట్ ప్యాడ్లకు తాకింది. దీంతో ఔట్ కోసం టీమిండియా ఆటగాళ్లు అప్పీల్ చేశారు. అయితే అంపైర్ తిరస్కరించాడు. డీఆర్ఎస్ కోరాలని కెప్టెన్ రోహిత్ శర్మను బుమ్రా కోరాడు. కానీ వికెట్ కీపర్ కేఎస్ భరత్ రోహిత్ శర్మ వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి.. బాల్ లెగ్ సైడ్ నుంచి వెళుతుందని చెప్పాడు. దీంతో కేఎస్ భరత్ సూచనతో రోహిత్ రివ్యూకు వెళ్లలేదు. 

రిప్లైలో క్లియర్ ఎల్బీడబ్ల్యూ అని తేలింది. దీంతో కేఎస్ భరత్ వైపు చూసిన బుమ్రా.. క్లియర్ ఔట్ అని చెప్పాను కదా అన్నట్లు సైగ చేశాడు. ఇండియా రివ్యూకు వెళ్లి ఉంటే.. డకెట్‌ను ఔట్ అయి ఉండేవాడు. కానీ తరువాత ఓవర్‌లోనే డకెట్‌ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. 52 బంతుల్లో 47 పరుగులు చేసిన డకెట్.. ఇంగ్లాండ్‌కు మంచి ఆరంభమే ఇచ్చాడు. కేఎస్ భరత్‌ను చూసి బుమ్రా ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Also Read: Ra Kadali Ra: జగన్‌ను దించడానికి మేం 'సిద్ధం'గా ఉన్నాం: 'రా కదిలి రా' సభలో చంద్రబాబు

Also Read: Amit Shah Tour Cancelled: అమిత్‌ షా తెలంగాణ పర్యటన రద్దు.. 'బిహార్‌' పరిణామాలే కారణమా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News