India Vs Pakistan 2023: భారత్ పాకిస్థాన్ మ్యాచ్ లో బంగారు ఫోన్ పోగొట్టుకున్న ఊర్వశీ

శనివారం అక్టోబర్ 14 న జరిగిన పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మ్యాచ్ చూడటానికి వచ్చిన బాలీవుడ్ భామ ఊర్వశీ రౌతేలా తన బంగారు ఫోన్ పోగొట్టుకున్నట్టు పోస్ట్ చేసింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 16, 2023, 03:27 PM IST
India Vs Pakistan 2023: భారత్ పాకిస్థాన్ మ్యాచ్ లో బంగారు ఫోన్ పోగొట్టుకున్న ఊర్వశీ

 India Vs Pakistan 2023: బాలీవుడ్ భామ ఊర్వశీ రౌతేలా ఏదొక విషయంలో వార్తల్లోకి చేరుతూనే ఉంటుంది. ఇదివరకు రిషబ్ పంత్ విషయంలో కూడా చాలా సార్లు నెట్టింట్లో చర్చ జరిగింది. RP అనే పేరుపైన సోషల్ మీడియాలో పోస్ట్  చేయటం వలన అందరు క్రికెటర్ పంత్ అనుకున్నారు. మరికొందరైతే.. మన టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని అనుకున్నారు. ఇప్పుడైతే ఆ చర్చ సద్దుమణిగిందనుకోండి.

ఇటీవల తెలుగు సినిమాల్లో ఐటెం సాంగ్స్  లో చేస్తూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్యలో ఐటం సాంగ్ లో మెరిసింది. తరువాత సాయిధరమ్ తేజ్.. రామ్ పోతినేని సినిమాల్లో కూడా ఐటం సాంగ్ చేసి అలరించింది. 

ఇపుడు మళ్లీ ఊర్వశీ రౌతేలా వార్తల్లోకి ఎక్కింది. అక్టోబర్‌ 14న శనివారం రోజున వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా నరేంద్రమోదీ స్టేడియంలో  భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే!  ఈ మ్యాచ్ కు చాలా మంది సెలబ్రెటీలు హాజరయ్యారు. 

వీరితో పాటుగా మ్యాచ్ చూడటానికి బాలీవుడ్ భామ ఊర్వశీ రౌతేలా స్టేడియానికి వచ్చింది. తనదైన స్టైల్ లో జట్టును ప్రోత్సహించి... స్టేడియంలో అభిమానులతో కలిసి రచ్చ రచ్చ చేసింది. కాకపొతే మ్యాచ్ అయ్యాక చాలా విలువైన ఫోన్ పోగొట్టుకున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 

 
 
 
 
 

Also Read: Balakrishna: ఆడపిల్ల తల్లిదండ్రులకు భారీ క్లాస్ పీకిన బాలకృష్ణ

"మ్యాచ్ వీక్షించే సమయంలో నా 24 క్యారెట్ల బంగారు ఐ ఫోన్ పోయింది. ఎవరికైనా దొరికితే వెంటనే సంప్రదించండి అని" ఇన్‌స్టాగ్రామ్‌లో ఊర్వశీ రౌతేలా పోస్ట్ చేసింది. తన ఫోన్ విషయంలో సాహయం చేయాలనీ అహ్మదాబాద్‌ పోలీసులను ట్యాగ్ చేయగా.. ఫోన్  పోయిందని పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. 

మ్యాచ్ జరిగే క్రమంలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అభిమానులతో  దిగే క్రమంలో ఫోన్ పోయి ఉండొచ్చని అనుకుంటున్నారు. ఊర్వశీ రౌతేలా ఇటీవల స్కంద సినిమా లో ఐటెం సాంగ్ లో మెరిసింది. అదేవిధంగా వాల్తేరు వీరయ్య, బ్రో మరియు ఏజంట్ సినిమాలో కూడా ఐటెం సాంగ్స్ లో మెప్పించింది. 

Also Read: Poco X5 Pro Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో బిగ్‌ డీల్‌..POCO X5 Pro 5G మొబైల్‌ కేవలం రూ. 5,550కే..ఆఫర్‌ వివరాలు ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

  

Trending News