SRH vs LSG: టాస్ గెలిచిన కేన్ మామ.. ఐపీఎల్ 2022లో బోణీ కొట్టేనా?! లక్నో జట్టులోకి హోల్డర్

IPL 2022, SRH vs LSG Playing XI. పూణేలోని డీవై పాటిల్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగనున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 4, 2022, 07:40 PM IST
  • రసవత్తర పోరుకు సిద్దమైన సన్‌రైజర్స్
  • టాస్ గెలిచిన కేన్ మామ
  • లక్నోతో బరిలోకి దిగే సన్‌రైజర్స్ జట్టు ఇదే
SRH vs LSG: టాస్ గెలిచిన కేన్ మామ.. ఐపీఎల్ 2022లో బోణీ కొట్టేనా?! లక్నో జట్టులోకి హోల్డర్

IPL 2022, SRH vs LSG Playing XI Out: ఐపీఎల్ 2022ను ఘోర ఓటమితో ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. మరికొద్దిసేపట్లో మెగా లీగ్‌లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. పూణేలోని డీవై పాటిల్ స్టేడియంలో జరుగనున్న ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. కేన్ మామ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. మరోవైపు లక్నో సారథి కేఎల్ రాహుల్ ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నట్లు చెప్పాడు. దుష్మంత చమీర స్థానంలో జేసన్ హోల్డర్ జట్టులోకి వచ్చాడు. 

రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఫేలవ ఆటతీరుతో ఓటమి పాలైన సన్‌రైజర్స్ హైదరాబాద్ కనీసం ఈ మ్యాచ్‌లోనైనా విజయం సాధించి బోణీ కొడుతుందేమో చూడాలి. సన్‌రైజర్స్ విజయం కోసం ఫాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మరోవైపు గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైన లక్నో సూపర్‌ జెయింట్స్‌..చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సంచలన విజయం సాధించింది.

తుది జట్లు:
సన్‌రైజర్స్ హైదరాబాద్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నికోలస్ పూరన్ (కీపర్), ఐడెన్ మార్క్‌రమ్, అబ్దుల్ సమద్, రొమారియో షెపర్డ్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, ఉమ్రాన్ మాలిక్. 
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డికాక్ (కీపర్), మనీష్ పాండే, ఎవిన్ లూయిస్, దీపక్ హుడా, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, జాసన్ హోల్డర్, ఆండ్రూ టై, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్.

Also Read: Suresh Raina: ఐపీఎల్ 2020 గుర్తుందిగా.. సురేష్ రైనా లేకుంటే చెన్నై పనైపోయినట్టే!

Also Read: Hyderabad: మందు బాబులకు గుడ్ న్యూస్... బార్ షాప్స్ టైమింగ్స్ పొడగించిన సర్కార్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 
 

Trending News